రాష్ట్రీయం

రేగులగూడెంలో పోడు రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండాల, మార్చి 28: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రేగులగూడెంలో పోడు భూములను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటారన్న ఆగ్రహంతో గ్రామానికి చెందిన ఆదివాసీలు మంగళవారం అటవీ శాఖ అధికారులపై దాడి చేసి వారి వాహనాలు, జెసిబిని దగ్ధం చేశారు. సోమవారం అటవీ శాఖ అధికారులు రేగులగూడెం గ్రామానికి వెళ్లి పిట్టతోగు ప్రాంతంలో జెసిబితో కందకాలు తవ్వుతామని ప్రజలకు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం అటవీ శాఖ సిబ్బంది రేంజర్ ప్రేమ్‌సాగర్ నాయకత్వంలో రెండు జెసిబిలు, ఒక జీపు, మూడు బైక్‌లతో రేగులగూడెం వెళ్లారు. పిట్టతోగు ప్రాంతానికి జెసిబిలతో వెళ్తుండగా రేగులగూడెం గ్రామస్థులు, మహిళలు అడ్డుకుని అటవీ శాఖ అధికారులపై దాడి చేసి ఒక జెసిబిని పూర్తిగా దగ్ధం చేసి, మరొక జెసిబి అద్దాలు పగలకొట్టారు. ఈ దాడిలో అటవీ శాఖ అధికారులకు చెందిన మూడు బైక్‌లు, జీపు ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తతగా మారటంతో పదిమంది అటవీ శాఖ అధికారులు చెల్లాచెదురయ్యారు. సుమారు 600 మంది గిరిజనులు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. కాగా తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీ శాఖ అధికారులు లాక్కునే ప్రయత్నం చేయగా ప్రతిఘటించామని గ్రామస్థులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఇల్లందు డిఎస్పీ ప్రకాశ్‌రావు సందర్శించి కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. కాగా అటవీ శాఖ అధికారులు హరితహారం పేరుతో గిరిజనుల భూములను లాక్కునేందుకు ప్రయత్నించటం, గిరిజన మహిళలపై పోలీసులు విచక్షణా రహితంగా దాడులు చేయటం అప్రజాస్వామికమని అఖిల భారత రైతు కూలీ సంఘం గుండాల మండల కమిటీ నాయకుడు ముక్తి సత్యం ఆరోపించారు. గిరిజనుల పోడు భూములను ఆక్రమించుకోవటం సరైంది కాదన్నారు.
తరతరాలుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీ భూములను హరితహారం పేరుతో అటవీ శాఖ బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుండటంతో ప్రత్యామ్నాయం లేక ఆదివాసీలు అటవీ, పోలీసు శాఖలపై తిరుగుబాటు సిద్ధమవుతున్నారు. గత ఏడాది చండ్రుగొండ మండలం మర్రిగూడెంలో ఆదివాసీలు సాగుచేసుకుంటున్న భూముల్లో అటవీ శాఖ అధికారులు హరితహారం పేరుతో ప్రవేశించి పంట చేలను తొలగించి, పొక్లెయిన్‌తో కందకాలు తవ్వుతుండగా అక్కడి ప్రజలు తిరగబడి అటవీ శాఖ, పోలీసు అధికారుపై దాడులు చేశారు. తాజాగా రేగులగూడెంలో అదే పరిస్థితి తలెత్తింది. రేగులగూడెం ప్రాంతంలో పదేళ్లుగా గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో మూడో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు భూమి హద్దులను నిర్ణయిస్తూ కందకాలు తవ్వేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించగా గిరిజనులు అడ్డుకున్నారు.ప్రభుత్వం పోడు భూములు లాక్కునే ముందుగా గిరిజనులకు ప్రత్యామ్నాయం చూపి భూములను స్వాధీనం చేసుకుంటే సమస్య ఉత్పన్నమయ్యేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.