రాష్ట్రీయం

తప్పు చేస్తే తాటతీస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 28: తప్పు చేస్తే ఎంతటి వారినైనా తాట తీస్తానని సిఎం చంద్రబాబు అసెంబ్లీలో గట్టిగా హెచ్చరించారు. స్వపక్షమైనా, విపక్షమైనా, అధికారులైనా.. ఎవరు తప్పు చేసినట్టు తేలినా ఉపేక్షించేది లేదన్నారు. విద్యార్థుల అత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో నిష్పాక్షికంగా విచారణ జరిపిస్తున్నామని, నివేదికలో వాస్తవమని తెలితే అందుకు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రతీ అంశాన్ని రాద్ధాంతం చేయడం ప్రతిపక్షానికి అలవాటైందన్నారు. మంగళవారం టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీపై గందరగోళ పరిస్థితులు తలెత్తి అసెంబ్లీ మూడుసార్లు వాయిదా పడింది. అనంతరం సభ సమావేశనపుడు చంద్రబాబు మాట్లాడుతూ ఈనెల 25న నెల్లూరు జిల్లాలో టెన్త్ పేపర్ లీక్‌పై ఉదయం 10.35కు డిఇవోకు సమాచారం అందిందన్నారు. వెంటనే 11.15కు పరీక్ష కేంద్రానికి ఫ్లైయింగ్ స్క్వాడ్, మరో గంటకులో జిల్లాస్థాయి పరిశీలకుడు చేరుకుని విచారణ జరిపారన్నారు. పరీక్ష కేంద్రంలోని మహేష్ అనే ఇన్విజిలేటర్‌ను విచారించగా, పవన్ అనే వాటర్‌బాయ్ పేపర్‌లను సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసినట్టు అంగీకరించాడన్నారు. వెంటనే పవన్, మహేష్‌ల ఫోన్‌లను స్వాధీనం చేసుకోవడంతోపాటు, ఇన్విజిలేటర్ మహేష్‌తోపాటు చీఫ్ సూపర్నెంట్‌ను సస్పెండ్ చేసినట్టు ప్రకటించామన్నారు. దీనిపై విచారణ జరపాలని ఎస్పీని అదేశించామన్నారు. ఇదే సమయంలో లీకైయిందని భావిస్తున్న పేపర్ వ్యవహారం ముందుగా సాక్షి రిపోర్టర్‌కు చేరిన అంశంపైనా విచారణ చేయిస్తామన్నారు. నారాయణ పాఠశాలలో టెన్త్ పరీక్ష కేంద్రాన్ని నిర్వహిస్తున్న విషయం వాస్తవమే అయినప్పటికీ, పరీక్షలను పూర్తిగా జంబ్లింగ్ విధానంలో జరపడమే కాకుండా పగడ్బందీ బందోబస్తు మధ్య పరీక్ష పత్రాలు సెంటర్లకు తరలిస్తున్నారన్నారు. రాష్ట్రంలో నేరస్థులు ఎంతటికైనా, ఎమైనా చేసేందుకు తెగిస్తున్నారన్నారు. పిల్లల జీవితాలతో ఆటలాడాలని ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.