రాష్ట్రీయం

హైబ్రిడ్ పొత్తు పొడిచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 28: ధాన్యాగారాలుగా పేరొందిన గోదావరి జిల్లాలు ప్రస్తుతం మొక్కజొన్న వైపు మొగ్గుచూపుతున్నాయి. మెట్టలో చాలాకాలం క్రితమే మొదలైన మొక్కజొన్న సాగు, ఇప్పుడు లంకలకు విస్తరిస్తోంది. మెట్ట సాగు ఎగుమతులపై ఆధారపడితే, లంకల్లో సాగవుతోన్న స్వీట్‌కార్న్ స్థానిక అవసరాలకే సరిపోతుండటం విశేషం. అప్పట్లో కేవలం సాధారణ రకం మొక్కజొన్న మాత్రమే సాగు జరిగేది. ప్రస్తుతం మొక్కజొన్నతోపాటు తీపి జొన్న (స్వీట్ కార్న్), తెల్ల జొన్న (కంకులు) విస్తారంగా సాగు చేస్తున్నారు. స్థానిక వినియోగమైనా హైబ్రీడ్ వంగడాలు అందుబాటులోకి రావడంతో దిగుబడి అధికంగా ఉండటం, ధర ఆశాజనకంగా ఉండటం, నీటి అవసరం తక్కువగా ఉండటంతో రైతులు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రస్తుతం గోదావరి తీర ప్రాంత భూములు మోన్‌శాంటో, పయోనీర్ వంటి హైబ్రీడు విత్తన సంస్థల పరిశోధనా క్షేత్రాలుగా మారాయి. మొక్క జొన్నలో ఆరు ప్రధాన రకాలు ఉండగా, సాధారణ ఎగుమతి రకం, స్వీట్ కార్న్ విస్తారంగా పండిస్తున్నారు. ఇందులో సాధారణ రకం మొక్కజొన్న గత ఏడాది వరకు విదేశీ అవసరాలకు అనుగుణంగా విస్తారంగా పండించారు. విదేశాల్లో డిమాండు లేకపోవడం, స్థానికంగానే ధరలు లాభసాటిగా ఉండటంతో ఎగుమతులు తగ్గిపోయాయి. స్థానిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పండిస్తున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్ల దాణాకు ముడిసరుకుగా మొక్కజొన్న ఉపయోగపడుతుండటంతో డిమాండు పెరిగింది. దీనికి అనుగుణంగానే సాగు పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మూడు లక్షల ఏభై వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగవుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం, కోరుకొండ, గోకవరం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, దేవరపల్లి, తాళ్ళపూడి తదితర మండలాల్లోని లంకలు, ఏటిపట్టు ప్రాంతాల్లో విస్తారంగా హైబ్రీడు రకం మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ఒక్క సీతానగరం మండలంలోనే దాదాపు 12వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు కనిపిస్తోంది. ఈ మండలాల్లో ఎకరానికి 35నుంచి 45 క్వింటాళ్ల దిగుబడి లభిస్తోంది. వ్యాపారులు ముందుగానే పంట పెట్టుబడి ఇచ్చి మరీ సాగుకు ప్రోత్సహిస్తున్నారు. తక్కువ నీటితోనూ, తేమతోనే పండించే విధానంలో మొక్కజొన్న, ఆ తర్వాతి స్థానంలో తెల్లజొన్న, ఆ తర్వాత తీపి జొన్న గోదావరి ప్రాంత పొలాల్లో సాగవుతోంది. ఈ ఏడాది రబీలో సాగుచేసిన మొక్కజొన్న పంట చేతికొచ్చింది. క్వింటాలుకు రూ.1,445 ధర లభిస్తోంది. ధర ఆశాజనకంగా ఉందని రైతులు అంటున్నారు.
ఇక స్వీట్ కార్న్ అయితే స్థానిక మార్కెట్‌లో పోషకాహారంగా విశేష ప్రాధాన్యత సంతరించుకోవడంతో దీని సాగుకూ రైతులు ముందుకొస్తున్నారు. కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉండటంతో తీపి మొక్కజొన్నను అల్పాహారంగా వాడుతున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో దాదాపు ఏభై వేల ఎకరాల్లో స్వీట్ కార్న్ సాగవుతోంది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం, కోరుకొండ, గోకవరం మండలాల్లో దాదాపు 25వేల ఎకరాల్లో స్వీట్‌కార్న్ సాగవుతోంది. అత్యధిక దిగుబడులు వస్తుండటంతో రైతులు హైబ్రీడు మొక్కజొన్న విత్తనాలతో సాగుకు అలవాటుపడ్డారు. దీంతోపాటు శెనగ, తెల్లజొన్న, వంగ, బెండ, టమోటా, కాకర, చిక్కుడు, బీన్స్, దోస, మునగ, ఆనప, సొర, బీర వంటి హైబ్రీడు విత్తనాలతో సాగు విపరీతంగా జరుగుతోంది.

చిత్రాలు..మొక్కజొన్న

శ్రీ హేమలంబ నామ ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ నిర్వహించిన వేడుకలకు హాజరైన తెలుగు రాష్ట్రాల సిఎంలు చంద్రబాబు, కె చంద్రశేఖర్ రావు