రాష్ట్రీయం

ఏడాదిలో లక్ష ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: ఒక్క గ్రేటర్ పరిధిలోనే ఈ ఏడాది లక్ష ఇళ్లు పూర్తి చేస్తామని గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు ప్రకటించారు. నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రులు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, జిల్లాల కలెక్టర్లు, జంట నగరాల ఎమ్మెల్యేలు, గృహ నిర్మాణ శాఖ, జిహెచ్‌ఎంసి అధికారులు పాల్గొన్నారు. గృహ నిర్మాణం వేగవంతం చేసేందుకు జిహెచ్‌ఎంసి తరఫున బిల్డర్లకు కావాల్సిన రాయితీలు ఇచ్చినట్టు కెటిఆర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు నేరుగా వర్కింగ్ ఏజెన్సీలతో మాట్లాడడం వల్ల అనేక కంపెనీలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ముందుకొస్తున్నారని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష ఇళ్ల నిర్మాణం ప్రారంభించి, వచ్చే ఏడాదికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 16.5 వేల ఇళ్లకు టెండర్ల ప్రక్రియ పూరె్తైందని, అనేక చాలాచోట్ల పనులు మొదలయ్యాయన్నారు. మరో 16వేల ఇళ్లకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. మిగిలిన సుమారు 70 వేల ఇళ్లకు ఒకేసారి టెండర్లకు అనుమతి తీసుకుంటామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల పనులను నేరుగా పర్యవేక్షిస్తామని, త్వరలోనే మరిన్ని చోట్ల మంత్రులతో కలిసి పనులకు శంకుస్థాపన చేస్తామని మంత్రులు చెప్పారు. నగరంలోని ఎమ్మెల్యేలు తమ తమ నియోజక వర్గాల్లో ఖాళీ స్థలాలను డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి గుర్తించాలని మంత్రులు సూచించారు. మురికివాడల్లో పేదలను చైతన్యపరుస్తూ అక్కడ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. నగరంలో హౌసింగ్ కోసం ప్రత్యేకంగా మేనేజ్‌మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆ శాక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని మంత్రి కెటిఆర్ కోరారు. వెంటనే జిహెచ్‌ఎంసి
అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతల్లోనూ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తామని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అమ్ముకోవడానికి వీల్లేకుండా నిబంధన చేర్చాలని మున్సిపల్ వ్యవహారాల మంత్రి కెటిఆర్ గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సూచించారు. కుటుంబానికి భరోసానిచ్చేలా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఉండాలని, అమ్ముకోవడానికి వీల్లేకుండా నిబంధనలు కఠినతరం చేయాలని సూచించారు. ఈ నిబంధన లేకపోతే పేదల జీవితాల్లో మార్పు సాధ్యంకాదని, ఈ ఇళ్లలో వాళ్లు జీవించినప్పుడే వారి సామాజిక స్థాయిలో మార్పు వస్తుందన్నారు.