ఆంధ్రప్రదేశ్‌

చరిత్రను తిరగరాస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 29: దేశంలో ఏ పార్టీకీ లేని కార్యకర్తల బలం తెలుగుదేశానికి ఉంది.. క్రమశిక్షణ..పట్టుదలకు మారుపేరుగా ప్రజలకు సేవలందిస్తున్నాం.. ఆ సేవలే మనకు బ్రహ్మాస్త్రాలు.. రేపటి ఎన్నికల్లో కార్యకర్తలు వాటిని ప్రయోగిస్తే ప్రతిపక్షం పరారవుతుంది.. చరిత్ర ఉన్నంత వరకు టిడిపి అధికారంలో ఉండేలా తిరగ రాయాల్సిన సమయం ఆసన్నమైందని జాతీయ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా బుధవారం రాత్రి పార్టీ కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించారు. కార్యకర్తలు, ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. పార్టీకి స్థిరాస్తి కార్యకర్తలే.. ప్రజలు..కార్యకర్తలను సమతుల్యం చేసుకుంటూ భవిష్యత్తులో మనతో కలబడే శక్తి ఏ పార్టీకి ఉండదన్నారు. గత 35 సంవత్సరాలుగా కార్యకర్తలు ఎన్నో ఒడిదుడుకులను అధిగమించారు. కొందరు నాయకులే అప్పుడప్పుడు తప్పటడుగులు వేశారుతప్ప కార్యకర్తలు పార్టీకి అండగా నిలిచారన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నాయకులు ముందుకు సాగాలన్నారు. ప్రతి పేదవాడు పండుగ జరుపుకునేందుకే చంద్రన్న కానుకలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రెవిన్యూ లోటు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడా రాజీపడలేదన్నారు. 2019 నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయటంతో పాటు వచ్చే ఎన్నికల్లో పులివెందులతో సహా అన్ని స్థానాలు టిడిపి ఖాతాలో చేరగలవనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ రాజకీయాలలో గెలుపు ఓటమి సహజమన్నారు. పరాజయంలో సైతం టిడిపి వెనుకడుగు వేయలేదని గుర్తుచేశారు. ఎన్నికల యుద్ధానికి కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సంక్షేమ కార్యక్రమాలకు జీవం పోసిన ఎన్టీఆర్
తమ ప్రాణాలను కార్యకర్తలు పణంగా పెట్టి పార్టీకి అన్నివేళలా అండదండలందించారని, వీరి త్యాగాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు అరండల్‌పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీకి సేవలు అందించిన కార్యకర్తలు, నాయకులను ఘనంగా సత్కరించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాయకులు తప్పటడుగులు వేసినప్పటికీ కార్యకర్తలు పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారన్నారు. ఏ ముహుర్తాన అన్న ఎన్‌టిఆర్ పార్టీని స్థాపించారో నాటి నుండి నేటి వరకు కార్యకర్తలే పార్టీకి పునాదులుగా నిలుస్తున్నారన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యుల కన్నా మిన్నగా గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలిచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలకు జీవం పోసింది దివంగత నందమూరి తారక రామారావేనని నివాళులర్పించారు. కిలో 2 రూపాయలకే బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పక్కా గృహనిర్మాణం వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలుచేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎన్‌టిఆర్ రాజకీయాల్లోకి వచ్చేముందు రంగులు పూసుకునే సినిమా వాళ్లు ఎలా పరిపాలిస్తారని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారన్నారు. అవినీతికి చిరునామా అయిన కాంగ్రెస్ పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతుంటే, అన్న ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతికాలంలోనే అధికారంలోకి వచ్చి ప్రజలకు అండగా నిలిచారన్నారు. 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌లో కూడా 24 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ 10 వేల కోట్ల రూపాయలతో డ్వాక్రా రుణమాఫీ చేశామని, తల్లిబిడ్డల సంరక్షణ నుండి చివరకు మహాప్రస్థానానికి చేరుకునే వరకు 30 వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో నూటికి 80 శాతం మంది పార్టీలో ఉండేవిధంగా కార్యకర్తలు, నాయకులు కృషిచేయాలని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న మనకు ప్రతిపక్షం ఉండాల్సిన పనే లేదని, ఏకపక్షమే సరిపోతుందన్నారు.
మహిళా కార్యకర్తలను సన్మానించరా?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి పార్టీ కోసం ఉత్తమ సేవలందించిన కార్యకర్తలను సన్మానించడంలో భాగంగా, రాష్టవ్య్రాప్తంగా అందరినీ పురుషులను మాత్రమే ఎంపిక చేయడంతో వేదిక వద్ద ఉన్న మహిళలు తమకు ప్రాధాన్యతనివ్వడం లేదంటూ సిఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సిఎం చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో పార్టీ కోసం పనిచేసే మహిళలను కూడా సన్మానిస్తామన్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలను సభలో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.