రాష్ట్రీయం

ఢిల్లీకి జాన్ తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 30: గత సోమవారం చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం సుక్మా జిల్లా సింగమడుగు వద్ద అదృశ్యమైన కెనడా దేశ పర్యాటకుడు జాన్‌ను గుర్తించి, విచారణ అనంతరం పోలీసుల రక్షణ మధ్య గురువారం కెనడా రాయబార కార్యాలయానికి అప్పగించారు. మావోయిస్టుల కోటలోకి తన సైకిల్ యాత్రలో భాగంగా ప్రవేశించిన జాన్ ఆచూకీ గల్లంతు కావడంతో కెనడా రాయబార కార్యాలయం అతన్ని క్షేమంగా అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. దీంతో బస్తర్ పోలీసులు రంగంలోకి దిగి స్థానిక గిరిజనులు, వ్యాపారుల సాయంతో కిష్టారం ప్రాంతంలోని అర్లంపల్లిలో ఉన్నట్లు గుర్తించారు. భద్రతా బలగాలను పం పించి సురక్షితంగా అతన్ని సుక్మా జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ విచారించిన అనంతరం ఇండిగో విమానంలో పోలీసు అధికారుల సాయంతో ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయానికి అతని సైకిల్‌తో సహా పంపించారు.