రాష్ట్రీయం

విస్తరణ ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 30: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది. ఏప్రిల్ 2 లేదా 6తేదీలలో ఏదో ఒక రోజు కచ్చితంగా మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఎమ్మెల్సీ అయిన లోకేష్‌ను ఎక్కువ రోజులు ఖాళీగా ఉంచడం మంచిదికాదన్న ఒత్తిళ్ల నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణను చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏప్రిల్ 2న విస్తరణ ముహుర్తం నిర్ణయించినట్లు గురువారం ఉదయం నుంచీ విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆరోజు ఉదయం 9.25 నిమిషాలకు సచివాలయం బయట ప్రమాణ స్వీకారం ఉంటుందనీ వార్తలు వచ్చాయి. సిఎం చంద్రబాబు జాతకం ప్రకారం రోహిణి-మృగశిర రెండు నక్షత్రాలు కలసి ఉన్నందున 2వతేదీ బాగుందని సికింద్రాబాద్‌కు చెందిన పవన్‌కుమార్ సిద్ధాంతి చెప్పారు. విజయవాడకు చెందిన ప్రముఖ సిద్ధాంతి పసుమర్తి కామేశ్వరశర్మ మాట్లాడుతూ 2, 6వ తేదీలు మంచి తేదీలేనని చెప్పారు. ‘2వ తేదీ చంద్రుడికి సంబంధించింది. దానికి ఆయన అధిపతి. 6వ తేదీ శుక్రుడికి సంబంధించింది. శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. కాబట్టి 6వ తేదీ ముహుర్తం దివ్యంగా ఉంటుంద’ని విశే్లషించారు. కాగా రాజ్‌భవన్ వర్గాలు మాత్రం 2వ తేదీన గవర్నర్ విజయవాడ షెడ్యూల్ లేదని చెబుతున్నాయి. ఇదిలాఉండగా, విస్తరణలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తోపాటు, పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు మంత్రి పదవి ఖాయమయింది. ఆయన మరదలైన మంత్రి మృణాళిని స్థానంలో కళాకు మంత్రి పదవి ఇవ్వనున్నారు. కళా స్థానంలో హోంమంత్రి చినరాజప్పకు పార్టీ అధ్యక్ష పదవి ఖరారయిందంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత సోమిరెడ్డికి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎంఏ షరీఫ్‌కు మైనారిటీ కోటాలో, పల్లె రఘునాథరెడ్డి స్థానంలో కర్నూలు జిల్లా నుంచి భూమా అఖిల ప్రియ, తూర్పు గోదావరి జిల్లా నుంచి నిమ్మకాయల చిన రాజప్ప స్థానంలో జ్యోతుల నెహ్రు, గుంటూరు జిల్లాలో పుల్లారావు స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన యరపతినేని శ్రీనివాసరావు, రావెల కిశోర్‌బాబు స్థానంలో అదే వర్గానికి చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు మంత్రి పదవులు ఖాయమంటున్నారు.
నెల్లూరు జిల్లాకు చెందిన బీసీల్లో కీలక వర్గమైన యాదవ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న జిల్లా పార్టీ అధ్యక్షుడయిన బీద రవిచంద్ర, పీతల సుజాత స్థానంలో విశాఖ జిల్లా నుంచి అనిత, చిత్తూరు జిల్లా నుంచి బొజ్జల స్థానంలో అమర్‌నాథ్‌రెడ్డి, అనంతలో పార్థసారధి లేదా కాల్వ శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో క్షత్రియ వర్గం నుంచి ఇప్పటివరకూ ఎవరికీ ప్రాతినిధ్యం లేనందున ఉండి ఎమ్మెల్యే శివరామరాజు, శెట్టి బలిజకు చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మంత్రి పదవి రేసులో ఉన్నారంటున్నారు. కెఇ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్‌ల శాఖలు మారనున్నాయి. కాగా, రావెల కిశోర్‌బాబు, పీతల సుజాత, బొజ్జల, పల్లెను కేబినెట్ నుంచి తొలగించటం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గుంటూరు జిల్లాలో ఒక మంత్రి కుటుంబసభ్యులపై ఉన్న ఆరోపణలు తొలగించుకోవాలని నాయకత్వం అనేకసార్లు హెచ్చరించినా అందులో విఫలమయ్యారని, జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ పార్టీ కోసం తాము కోట్లు ఖర్చు పెట్టామన్న ఆయన కుటుంబసభ్యుల వ్యాఖ్యలు బాబు దృష్టికి వెళ్లటం కూడా ఆయన పదవీచ్యుతికి కారణం కానుందని సీనియర్లు చెబుతున్నారు. మరోమంత్రి ఇప్పటికే వైసీపీ నేతలతో మంతనాలు సాగించిన విషయం నాయకత్వానికి తెలియడం వల్లే ఆయనను తప్పించనున్నారని చెబుతున్నారు. కాగా, అచ్చెన్నాయుడిని కొనసాగిస్తూనే గౌతుశివాజీకి ఇవ్వాలా? లేక తప్పించాలా అన్న దానిపై సందిగ్ధంలో ఉన్నారని చెబుతున్నారు. అయితే, అనంతపురంలో ఒక సామాజికవర్గం కొద్దికాలం నుంచి పల్లె రఘునాథరెడ్డిపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని, ఆయన రెడ్డి వర్గానికే పనిచేస్తున్నారని, వైసీపీ నేతలపట్ల అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారమే ఆయనకు ఎసరు పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.