రాష్ట్రీయం

మండలి డిప్యూటీ చైర్మన్‌గా రెడ్డి సుబ్రమణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 30: శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా రెడ్డి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతరులెవరూ ఆ పదవికి నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయంగా ప్రభావం చూపే బీసీల్లోని శెట్టి బలిజ వర్గానికి చెందిన సుబ్రహ్మణ్యాన్ని ఆ పదవికి ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం నిర్ణయం తీసుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ గత కొద్దికాలం నుంచీ ఆందోళన చేస్తున్న శెట్టిబలిజ వర్గాన్ని సంతృప్తి పరచడంతోపాటు, పార్టీకి పునాదిరాళ్లయిన బీసీలకు పట్టం కట్టేందుకు బాబు తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ వర్గాల్లో హర్షం వ్యక్యమవుతోంది. కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ బీసీ వర్గాల్లో వస్తున్న విమర్శలను అధిగమించేందుకు బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో రెండు కులాలను సమన్వయం, సమన్యాయం చేయడంలో బాబు సఫలమయ్యారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, సభ హుందాతనాన్ని నిలబెడతానని ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం హామీ ఇచ్చారు. కాగా, శెట్టి బలిజ వర్గానికి చెందిన రెడ్డి సుబ్రమణ్యంకు శాసనమండలి డెప్యూటీ చైర్మన్ ఇవ్వనున్నట్లు గురువారం నాటి ఆంధ్రభూమి దినపత్రికలో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే.