రాష్ట్రీయం

చండశాసనుణ్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 30: ‘నాకు ఎవరినీ కాపాడాల్సిన అవసరంలేదు.. విద్యార్థులకు ఎలాంటి అనుమానాలు లేకుండా వివరణ ఇచ్చాం.. ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపట్టాం.. బాధ్యుల్ని వదిలే ప్రసక్తేలేదు.. తప్పు జరిగితే తోలు వలుస్తా.. నేను చండ శాసనుడిని..’అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో నిప్పులు చెరిగారు. పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో బాధ్యులైన మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని, కేసును పక్కదారి పట్టిస్తున్నారంటూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. నెల్లూరు ధనలక్ష్మీపురం నారాయణ విద్యా సంస్థ పరీక్షా కేంద్రంలో టెన్త్ ఫిజిక్స్ ప్రశ్నాపత్రం ఈ నెల 25వ తేదీన లీకయిందని, లావా అనే పేరుతో అక్కడి అటెండర్ ప్రశ్నా పత్రాన్ని లీక్‌చేసి ఆపై ఇన్విజిలేటర్‌కు ఫోన్‌ద్వారా సమాచారం అందించారన్నారు. ఇది 9.25 గంటలకు జరిగిందని, 10.30 గంటలకు సాక్షి దినపత్రిక విలేకరి డిఇఒకు ముందుగా ఫోన్‌చేసి వివరణ కోరారన్నారు. వెనువెంటనే స్క్వాడ్ అధికారితో సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకున్నారని చంద్రబాబు వివరణ ఇచ్చారు. అయితే అటెండర్ నుంచి సాక్షి విలేకరి ఫోన్‌లో ప్రశ్నపత్రం ఎలా పంపారనే కోణంలో కూడా విచారణ జరుగుతోందన్నారు. ఈ వ్యవహారంపై ప్రజలకు అదేరోజు సమగ్రంగా వివరించామన్నారు. ఇందుకు బాధ్యుడైన ఇన్విజిలేటర్ మహేష్‌ను విధుల నుంచి తొలగించారన్నారు. ఆ కేంద్రంలో 13 మంది ఇన్విజిలేటర్లుగా ఉన్నారని వీరంతా ప్రభుత్వ ఉపాధ్యాయులే అన్నారు. సెల్‌ఫోన్ ద్వారా సమచారం తెలుసుకుని పరీక్షలు రాసిన అభ్యర్థుల పేర్లను కూడా సిఎం ప్రకటించారు. బాధ్యులు 7గురిని గుర్తించి వారిని రిలీవ్ చేశామని, అదేరోజు మరొకర్ని సస్పెండ్ చేశారన్నారు. జంబ్లింగ్ విధానం అమలులో ఉన్నందున నారాయణ కళాశాల విద్యార్థులే ఆ కేంద్రంలో పరీక్షలు రాయటం లేదన్న విషయాన్ని ప్రతిపక్షం గ్రహించాలన్నారు. వైసిపి ఈనెల 28న శాసనసభలో ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు వివరించామని, ప్రతిపక్ష నేత సభ నుంచి ఆరోజు ఎందుకు పరారయ్యారని ప్రశ్నించారు. ముఖాన బురదజల్లి తప్పించుకు పారిపోవటం మంచి సంప్రదాయం కాదన్నారు. ఎక్కడ తప్పు జరిగిందో విచారణలో తేలుతుందన్నారు. ‘తప్పుడు లెక్కలు..విచారణలతో జైలుకు వెళ్లివచ్చిన వారా నన్ను
విమర్శించే’దంటూ మండిపడ్డారు. వైఎస్ హయాంలో 2004లో 405, 2006లో 254, 2007లో 245 ఇలా వందల సంఖ్యలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. తమ హయాంలో ఈ ఏడాది 41 కేసులు మాత్రమే నమోదయ్యాయని, భవిష్యత్తులో ఇవి కూడా ఉండవన్నారు. ‘నిజాలు నిగ్గుతేల్చటానికి మేం సిద్ధంగా ఉన్నాం.. పరీక్షలు రద్దుచేసే ప్రసక్తేలేదు.. ఎవరు తప్పుచేసినా వదిలిపెట్టం.. ఏ విద్యార్థి ఎక్కడ పరీక్ష రాస్తున్నారో.. ఏ ఇన్విజిలేటర్ ఎక్కడ పనిచేస్తున్నారో జంబ్లింగ్ విధానంలో పసికట్టే వీలుంది.. ఈ విధానాన్ని మేమే ప్రవేశపెట్టా’మని అన్నారు. నేరం చేయటం ఎంత తప్పో దాచిపెట్టటం కూడా అంతే తప్పవుతుందన్నారు. దీనిపై స్టింగ్ ఆపరేషన్ జరిగిందా..లేక వాస్తవమేనా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ‘సత్యం రామలింగరాజు.. హర్షద్ మెహతా కోవకు చెందిన వాడు ప్రతిపక్ష నాయకుడయ్యాడు.. ఆ హోదా లేకపోతే పోలీసుల పరిభాషలో ఆర్థిక నేరస్థుడిగా అతడ్ని పిలిచేవారు..నువ్వా నున్ను విమర్శించేది..నీకు సమాధానం చెప్పాలా.. 20 మంది ఎమ్మెల్యేలతో ఆరోపణలు చేస్తే వివరణ ఇవ్వాలా’అని సిఎం చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతపురం జిల్లా మడకసిరలో ఇదే తరహాలో లీకైతే పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు..బాధ్యుల్ని సస్పెండ్‌చేసి విద్యార్థులను డీబార్ చేశారని వివరించారు. పత్రికల పేరుతో తప్పుడు పనులు చేయద్దు.. నేరస్థుడికి అంతా అలానే కనిపిస్తారని జగన్‌పై మండిపడ్డారు. లీకేజి వ్యవహారంలో దోషులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
ఇవిగో ఫోన్ నెంబర్లు
నెల్లూరులో టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజికి సంబంధించి ఇన్విజిలేటర్‌తో పాటు సాక్షి విలేఖరి, కీలక సూత్రదారి అయిన వాటర్‌బాయి ప్రవీణ్ నెంబర్లను సిఎం సభ ముందుంచారు. ఈ కేసులో 9885646986 నెంబరుతో పాటు ఇన్విజిలేటర్ మహేష్ సెల్ నెంబర్ 98856 73545గా నమోదయిందని, వీరి ద్వారా నారాయణ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తున్న అనుదీపిక, అరవింద్, శ్రీధర్, కమలేష్‌కుమార్, హారిక, రమ్య అనే అభ్యర్థులను గుర్తించారన్నారు.