తెలంగాణ

మిషన్ భగీరథలో మహబూబ్‌నగర్ ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: మిషన్ కాకతీయ పనుల్లో అటవీ శాఖ అనుమతుల విషయంలో మహబూబ్‌నగర్ జిల్లా అధికారుల పనితీరు బాగుందని మిగిలిన జిల్లాల అధికారులు వారిని అనుసరించాలని పంచాయితీరాజ్ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. అటవీ శాఖ నుంచి అనుమతులు పొందేందుకు అనుసరించాల్సిన పద్దతుల గురించి చర్చించారు. వన్యమృగ సంరక్షణ ప్రాంతాల్లో అనుమతులు పొందే విషయంలో వైల్డ్ లైఫ్ నిపుణులతో ప్రభుత్వం చర్చించినట్టు చెప్పారు. ఈనెల 12న మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమీక్షా సమావేశానికి పూర్తి వివరాలతో హాజరు కావాలని ఎస్‌పి సింగ్ అధికారులను ఆదేశించారు. నియోజక వర్గం, సెగ్మెంట్ల వారిగా వారీగా పనులు ఎలా జరుగుతున్నాయో, డిజైన్ల పురోగతి ఏ విధంగా ఉందో పూర్తి వివరాలతో సమీక్షకు హాజరు కావాలని ఆదేశించారు. ఈనెల 11న వర్క్ ఏజెన్సీలు, ఎస్‌ఇలతో సమావేశం నిర్వహించాలని ఇఎన్‌సి సురేందర్‌రెడ్డిని ఎస్‌పి సింగ్ కోరారు.