రాష్ట్రీయం

తరలింపా.. సడలింపా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 1919 మద్యం షాపులు, 492 బార్ల భవితవ్యంపై నీలినీడలు నెలకొన్నాయి. జాతీయ, రాష్ట్ర హైవేలపై ఉన్న మద్యం షాపులు, బార్లను మార్చి 31లోగా వేరే చోటికి తరలించాలని సుప్రీంకోర్టు గత డిసెంబర్‌లో ఆదేశించింది. వీటిని తరలించడానికి విధించిన గడువు (మార్చి 31) నేటితో ముగియనుంది. మరోవైపు మద్యం షాపులు, బార్లను వేరే చోటికి తరలించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును గురువారం విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందోనని మద్యం, బార్ షాపుల యజమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలలో ఉత్కంఠత నెలకొంది. సుప్రీంకోర్టు విధించిన గడువులోగా మద్యం, బార్ షాపులను ఈ పాటికి వేరే చోటికి తరలించాల్సి ఉన్నప్పటికీ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో తరలించాల్సిన షాపులు, బార్లకు నోటీసులు ఇవ్వడం మినహా ప్రత్యామ్నాయంగా ఇతర చోట్లకు తరలించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కోర్టు తీర్పును అనుసరించి వీటిని తరలించాలని ఇరు రాష్ట్రాలు భావిస్తున్నాయి. రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం, బార్ షాపులను రహదారులపై నుంచి ఇతర చోటికి తరలించడం వల్ల మద్యం అమ్మకాలు, లైసెన్స్‌లపై వచ్చే ఆదాయం పడిపోతుందని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం, బార్లను రహదారలకు దూరంగా ఇతర చోటికి తరలించడం వల్ల మద్యంపై వచ్చే ఆదాయం తెలంగాణలో 50 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 40 శాతం పడిపోతుందని ఇరు రాష్ట్రాలు అంచన వేశాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2216 మద్యం షాపులు ఉండగా అందులో 1120 మద్యం షాపులు, 395 బార్లు జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లకు సమీపంలో ఉన్నట్టు గుర్తించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 4380 మద్యం షాపులు ఉండగా అందులో 799 మద్యం షాపులు, 97 బార్లు జాతీయ, రాష్ట్ర రహదారికి 500 మీటర్ల సమీపంలో ఉన్నట్టు గుర్తించింది. తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై గత ఆర్థిక సంవత్సరంలో రూ.12,705 కోట్ల ఆదాయం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు రూ.11,735 కోట్ల ఆదాయం రాగా, మార్చి నెలాఖరు వరకు రూ.12 వేల కోట్లు దాటనుందని అంచన వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రహదారులపై ఉన్న మద్యం షాపులు, బార్లను వేరే చోటికి తరలించడం వల్ల ప్రస్తుతం వస్తున్న ఆదాయం సగానికి తగ్గుతుందని తెలంగాణ ప్రభుత్వం అంచన వేసింది. రహదారులపై ఉన్న మద్యం షాపులు, బార్ల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది. రాష్ట్రాల ఆదాయం పడిపోతుందన్న కోణంలో కాకుండా రోడ్డ్ ప్రమాదాలను నివారించే ఉద్దేశంతోనే రహదారులకు దూరంగా మద్యం షాపులు, బార్లు తరలించాలని ఆదేశించినట్టు కోర్టు వాదన. అయితే వీటిని ఇతర చోటికి తరలించడం వల్ల తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత తలెత్తుతుందని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వాలు విన్నవించాయి. రిజర్వు చేసిన తీర్పు ఎలా ఉంటుందని అటు మద్యం వ్యాపారులు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా ఎదురు చేస్తున్నాయి.