రాష్ట్రీయం

సీతారాముల పెళ్లికి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 30: ఏప్రిల్ 5న జరిగే సీతారాముల కల్యాణానికి, 6న జరిగే మహా పట్ట్భాషేకానికి రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నర్సింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భద్రాచల దేవస్థానం ఇఓ తాళ్లూరి రమేశ్‌బాబు, అర్చకులు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఉగాది పర్వదినాన ఆలయం తరఫున ప్రసాదం, జ్ఞాపిక అందజేసి ఆశీర్వదించారు. సీతారాముల కల్యాణ మహోత్సవం పెళ్లి శుభలేఖను ముందుగా గవర్నర్, తర్వాత ముఖ్యమంత్రికి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఇచ్చారు. కల్యాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలతో, మహా పట్ట్భాషేకానికి గవర్నర్ నర్సింహన్ పట్టు వస్త్రాలతో రావడం ఆనవాయితీ. మర్యాద పూర్వకంగా ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది.