రాష్ట్రీయం

మాయాబజార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/విశాఖపట్నం, మార్చి 31: మనం ఎగ్జిబిషన్‌కో లేదా సేల్ జరిగే సంతకో వెళితే ‘రండి బాబు రండి... ఆలసించిన ఆశాభంగం’ అనే మాటలు ఎక్కువగా విన్పిస్తుంటాయి. కాకపోతే వారు చిరు వ్యాపారులు. వారు అమ్మేవి అంత ఖరీదైన వస్తువులు కాదు. కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ద్విచక్రవాహనాలు అమ్మేవారు కూడా పాటిస్తున్నారు. వారిని అలా పాటించేలా చేసింది సుప్రీం కోర్టు తీర్పు. కాలుష్య నియంత్రణ కోసం ఏప్రిల్ 1వ తేదీ నుంచి బిఎస్-3 వాహనాలపై నిషేధం విధిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువడడంతో విజయవాడ నగరంలో శుక్రవారం ఆ వాహనాలు హాట్ కేక్‌ల్లా అమ్ముడుపోయాయి. హీరో, బజాజ్, హోండా బైక్ షోరూమ్‌ల వద్ద ఉదయం నుండే సందడి నెలకొంది. ఆశ్చర్యకరమేమిటంటే పలు షోరూంలలో గంట సమయానికే ‘నో స్టాక్’ బోర్డులు వేలాడుతూ కన్పించాయి. ప్రధానంగా దళారులు పలు షోరూమ్ యజమానులతో కుమ్మక్కయి బినామీ పేరులతో అడ్వాన్స్‌లు ఇచ్చారు. కృత్రిమ కొరత సృష్టించటం అటుంచి క్షణాల్లో కుబేరులయ్యారు. పలు షోరూంలు ఈ ఒక్కరోజే రూ.12 వేల నుంచి రూ.22 వేల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో కొనుగోలుదారులు బారులుదీరారు. ఫైనాన్స్ ఇచ్చేందుకు ఫైనాన్స్ కంపెనీలు నిరాకరిస్తున్నప్పటికీ నగదుతో కొనుగోలు చేసేందుకు కూడా వెనుకాడలేదు. సుజికి జిక్సర్ షోరూంలలో రూ.77,452లకే దొరికింది. సుజుకి జిక్సర్ మాత్రమే కాక, యాక్టివా 3జి కూడా రూ.50,290కు, డ్రీమ్ యుగ రూ.51,741 రూపాయలకు, సీబీ షైన్ రూ.55,799 రూపాయల నుంచి రూ.61,283 రూపాయల వరకు, సీడీ 110డిఎక్స్ రూ.47,202 రూపాయల నుంచి 47,494 రూపాయల ధరల్లో లభ్యమయ్యాయి. హోండా రూ.22 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆపర్ ప్రకటించడంతో జనం ఎగబడ్డారు. ఇక హీరో మోటార్ కార్పొరేషన్ కూడా బిఎస్-3 టూ వీలర్స్‌పై రూ.12,500 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో స్కూటర్స్ డ్యూయెట్ రూ.49,480కు అందుబాటులోకి వచ్చింది. ఇక మాస్ట్రో ఎడ్జ్ నైతే రూ.51,030 అమ్మారు. ప్రీమియం బైకులపై రూ.7,500, ఎంట్రీలెవల్ బైకులపై రూ.5000ల వరకు హీరో ఆఫర్ ప్రకటించింది. దీంతో గ్లామర్ రూ.59,755కు, స్ప్లెండర్ రూ.55,575కు దొరికింది. ఒక్క హీరో, హోండా కంపెనీలు మాత్రమే కాక, సుజికి బైకులు, బజాజ్ బైకులు కూడా తక్కువ ధరకే అమ్మారు. ఇదిలా ఉంటే మూడు నాలుగు రోజుల క్రితం బైక్ నిర్ణీత ధరకే బుక్ చేసుకున్నవారు నేడు హడావుడిగా షోరూంలవద్దకు వచ్చి నేటి ఆఫర్‌ను ముందుగా బుక్ చేసుకునేవారికి ఎందుకు ఇవ్వరంటూ కేకలు వేస్తుండటంతో అక్కడ రచ్చ రచ్చ జరిగింది.
డీలర్లు, సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రేతలు ముందుగానే ఏర్పాట్లు చేసుకుని ఈ డిస్కౌంట్ సౌకర్యం సామాన్యుడికి దక్కకుండా చేశారు. దాంతో అన్ని షోరూమ్‌ల ముందు నో స్టాక్ అనే బోర్డులు దర్శన మిచ్చాయి.
గతంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ సైతం ఆర్‌టిఏ కార్యాలయాల్లోనే చేసే వారు. కానీ ఇప్పుడు డీలర్లే తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల వరకు ఆన్‌లైన్‌లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని రవాణా శాఖ కల్పించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చాలా మంది డీలర్లు కంపెనీ డిస్కొంట్‌ను దక్కించుకున్నారు. డీలర్లకు పాత వాహనాల విక్రేతలకు సంబంధాలు ఉంటాయి. ఈ సంబంధాలు ఇప్పుడు డిస్కౌంట్‌ను స్వాహా చేసేందుకు ఉపయోగపడ్డాయి. ప్రతి డీలర్ ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రకటిస్తారు. పాత వాహనాన్ని తీసుకుని కొత్త వాహనం ఇవ్వడం. నిజానికి పాత వాహనం డీలర్ కొనడు.సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసే వారు కొంటారు. దీని కోసం ప్రతి డీలర్‌కు సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రేతలతో పరిచయాలు ఉంటాయి.
బిఎస్ 3 వాహనాలకు భారీ డిస్కౌంట్ ప్రకటించడంతో పాత వాహనాల వ్యాపారం సాగించే వ్యాపారుల రంగంలోకి దిగి కొనుగోలు చేశారు. పాత వాహనం కన్నా తక్కువ ధరకు బిఎస్3 కొత్త వాహనం దొరుకుతుండడంతో రంగంలోకి దిగారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత కొంత తక్కువ ధరకు విక్రయించడానికి వీరికి అవకాశం ఉంటుంది.
రోజూ వాహనాల వ్యాపారంలోనే ఉంటాం, చివరకు మాకే డిస్కౌంట్ ధరకు ద్విచక్ర వాహనం దొరక లేదని హైదరాబాద్‌లోని తిరుమలగిరి ఆర్‌టిఏ ఏజెంట్ అశోక్ తెలిపారు.
కాగా వాహనాల విక్రయాల్లో దళారుల ప్రమేయం ఉండే అవకాశం లేదని, స్పాట్‌లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని, దీనివల్ల పొరపాటు జరిగే అవకాశం లేదని విశాఖ షోరూం ప్రతినిధి ఒకరు తెలిపారు.

చిత్రాలు..షోరూమ్‌ల వద్ద బారులు తీరిన కొనుగోలుదారులు,
*షోరూమ్‌ల వద్ద నో స్టాక్ బోర్డులు