రాష్ట్రీయం

విద్యుత్ చార్జీల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరిగా యి. అయితే గృహ విద్యుత్ వినియోగదారులను మాత్రం మినహాయించారు. 2700 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగంపై చార్జీల భారం మోపలేదు. కాగా మొత్తం రూ. 800 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించింది. పెంచిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. మొత్తం 4.8 శాతం మేర విద్యుత్ చార్జీలను పెంచారు. గృహ విద్యుత్ రంగం లో గ్రూప్ ఏ, గ్రూప్ బి కేటగిరీలను విద్యుత్ చార్జీల నుంచి మినహాయించారు. గ్రూప్ బి కేటగిరీలో నెలకు పది రూపాయల చొప్పున కస్టమర్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. గ్రూప్-సి కేటగిరీ గృహ విద్యుత్
వినియోగదారులకు మూడు శాతం మేర విద్యుత్ చార్జీలను పెంచారు. ఈ వివరాలను ఏపిఇఆర్‌సి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ శుక్రవారం ఇక్కడ సింగరేణి భవన్‌లో ఏపిఇఆర్‌సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు.
వ్యవసాయ విద్యుత్‌కు చార్జీలు వర్తించవు. ఎప్పటిలాగానే ఉచిత విద్యుత్ విధానం అమలులో ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 1.59 కోట్ల వినియోగదారులు ఉన్నారు. ఇందులో 1.44 కోట్ల మందిపై చార్జీల ప్రభావం లేదు. అంటే 90.5 శాతం మంది వినియోగదారులకు పెరిగిన చార్జీలు వర్తించవు. 15 లక్షల మంది వినియోగదారులకే విద్యుత్ భారం పడుతుంది. వినియోగదారుల్లో వీరి శాతం 9.5 శాతంగా ఉంది.
ఉచిత విద్యుత్ పరిధిలో 15.47 లక్షల మంది రైతులున్నారు. వీరికి ఏడు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపిఇఆర్‌సి అనుమతించింది. రాష్ట్రంలో 1.28 కోట్ల మంది గృహ విద్యుత్ వినియోగదారులున్నారు. ఎల్‌టి-1(ఏ) కేటగిరీలో ఉన్న గృహ విద్యుత్ వినియోగదారుల్లో మూడు గ్రూపులున్నాయి. ఏ గ్రూపులో 900 యూనిట్ల వరకు, బి గ్రూపులో 2700 యూనిట్ల వరకు, సి గ్రూపులో 2700 యూనిట్లకుపైగా విద్యుత్ వినిమయం చేసే వినియోగదారులున్నారు. ఇందులో కస్టమర్ చార్జీలను బి గ్రూపులో ఉన్న వినియోగదారులకే వర్తింప చేశారు. గ్రూప్ సిలో ఉన్న 5.83 లక్షలమంది వినియోగదారులకు 3 శాతం మేర విద్యుత్ చార్జీలను పెంచారు.
ఎల్‌టి-2(ఏ)లో 6.45 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీరు గృహేతర, వాణిజ్య వినియోగదారుల కేటగిరీలోకి వస్తారు. వీరిలో 53 శాతం మంది నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినిమయం చేస్తారు. వీరికి చార్జీలు పెంచలేదు. ఎల్‌టి-4 కేటగిరీలో కుటీరపరిశ్రమలు వస్తాయి. ఈ కేటగిరీ చార్జీలు పెంచలేదు.
ఎల్‌టి పరిశ్రమ జనరల్ కేటగిరీలో సీజనల్ పరిశ్రమలు, అక్వా కల్చర్, పశు సంవర్ధక కేటగిరీ, కోళ్లపరిశ్రమ, చక్కెర కేన్ క్రషింగ్, కుందేళ్ల ఫాం, పూలతోటలు, మత ప్రదేశాలు, హెచ్‌టి-1 ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమలు, హెచ్‌టి-2 మతపరమైన ప్రదేశాలకు సంబంధించి విద్యుత్ చార్జీలను మూడు శాతం పెంచారు. హెచ్‌టి-1 పరిశ్రమలకు విద్యుత్ చార్జీలను 3.6 శాతం పెంచారు.
రాష్ట్రప్రభుత్వం రూ.3700 కోట్ల మేర సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది. ముందు రూ. 3300 కోట్ల మేర సబ్సిడీ ఇస్తామని చెప్పిన ఆంధ్రప్రభుత్వం ఆ తర్వాత విద్యుత్ భారం తగ్గించేందుకు మరో రూ. 400 కోట్లను భరించేందుకు సంసిద్ధతతను తెలియచేస్తూ ఏపిఇఆర్‌సికి లేఖ రాసింది.
ఆంధ్రలోని డిస్కాంలు రూ. 8065 కోట్ల మేర రెవెన్యూ లోటును చూపెట్టాయి. దీని ప్రాతిపదికను రూ.1111 కోట్ల విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని ఏపిఇఆర్‌సిని కోరాయి. సబ్సిడీ రూ. 6937 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి. కాగా ఏపిఇఆర్‌సి సామాన్యులపై విద్యుత్ భారం పడకుండా విద్యుత్ కొనుగోలు ధరలను రూ.2300 కోట్ల మేర తగ్గించింది. అంటే 434 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనేందుకు అనుమతించలేదు. ఈ మేరకు మిగిలిన సొమ్ము, రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ, అంతర్గత సామర్ధ్యం ద్వారా నిధులు పెంచుకోవాలని కోరుతూ రూ. 800 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచేందుకు ఏపిఇఆర్‌సి అనుమతించినట్లు జస్టిస్ భవానీ ప్రసాద్ తెలిపారు. విద్యుత్ అమ్మకాల విలువ 510 ఎంయు మేరకు తగ్గించామన్నారు.
ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సాలీనా 1200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అనుమతించారు. గృహ విద్యుత్ వినియోగదారులకు ఫిక్స్‌డ్ చార్జీలను విధించలేదన్నారు. ఎల్‌టి-2లో మొదటి 50 యూనిట్ల వరకు ఫిక్స్‌డ్ చార్జీలను నెలకు 0.12పైసలను తగ్గించారు. ఫిక్స్‌డ్ చార్జీలు రూ. 30 లోపల ఉన్న వినియోగదారులకు సంబంధించి నెలకు రూ.30, ఇతర కేటగిరీల్లో రూ.55.12 వరక ఉన్న చార్జీలను రూ.75కు, రూ.385.84 వరకు ఉన్న ఫిక్స్‌డ్ చార్జీలను రూ. 475కు పెంచారు. ఆలస్యంగా బిల్లులు చెల్లించేవారికి 18 శాతం వడ్డీతో బిల్లులు చెల్లించాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు.

చిత్రం..విద్యుత్ టారీఫ్‌ను ప్రకటిస్తున్న ఉన్నతాధికారులు