రాష్ట్రీయం

గడువు వరకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: జాతీయ, రాష్ట్ర హైవేలపై ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం షాపులు, బార్లకు లైసెన్స్‌ల గడువు ముగిసే వరకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మద్యం షాపులు, బార్లను ఏప్రిల్-1, 2017లోగా ఇతర చోట్లకు తరలించాలని గత డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై తమకు కొంత వ్యవధి ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై తీర్పును గురువారం రిజర్వు చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేల్‌కర్, న్యాయమూర్తులు జస్టిస్ డివై చండ్రచూడ్, ఎల్‌ఎన్ రావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై తెలుగు రాష్ట్రాలకు కొంత వెసులుబాటు కల్పించింది. తెలంగాణలో మద్యం షాపులు, బార్ల లైసెన్స్‌ల గడువు ముగిసే సెప్టెంబర్ 30వరకు, ఆంధ్రప్రదేశ్‌లో లైసెన్స్‌ల గడువు ముగిసే జూన్ 30 వరకు యధాతథంగా కొనసాగించే అవకాశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. అయితే ఈ వెసులుబాటు గత డిసెంబర్ 15న తమ ఆదేశాల జారీకి ముందునుంచి కొనసాగుతున్న షాపులు, బార్లకు మాత్రమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో కొత్త మద్యం షాపులు, బార్లకు అనుమతి ఇవ్వకూడదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో మద్యం షాపులు, బార్లు ఉండరాదన్న నిబంధన నుంచి 20 వేల జనాభా కలిగి ఉన్న పట్టణాలకు కొంత వెసులుబాటు కల్పిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి పట్టణాలలో 500 మీటర్ల పరిధిని 220 మీటర్లుగా సడలింపు ఇచ్చింది. భౌగోళిక స్వరూపం దృష్ట్యా పర్వత ప్రాంత రాష్ట్రాలు అయిన సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలకు ఈ నిబంధన వర్తించదని సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. మద్యం షాపులు, బార్లకు ఇప్పటికే లైసెన్స్‌లు జారీ చేయడంతో వాటిని ఇతర చోటికి తరలించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కోల్పొవాల్సి వస్తుందని, ఫలితంగా దీని ప్రభావం తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పడుతుందని సుప్రీంకోర్టుకు తెలుగు రాష్ట్రాలు చేసిన వినతి మేరకు వాటి గడువు ముగిసే వరకు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు కల్పించిన వెసులుబాటుతో తెలుగు రాష్ట్రాలకు ఊరట లభించింది.