రాష్ట్రీయం

ముగిసిన ఎస్బీహెచ్ శకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: చరిత్రలో ఎస్బీహెచ్ శకం ముగిసిపోయింది. 76 ఏళ్ల ప్రస్థానాన్ని ముగించుకుని ఎస్బీఐలో విలీనమైన ఎస్‌బిహెచ్ ఖాతాదారులకు ఓ జ్ఞాపకంగా మాత్రమే మిగలనుంది. 1941 ఆగస్టు 8న హైదరాబాద్ స్టేట్ బ్యాంక్‌గా మొగ్గతొడిగి, 76 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో రికార్డులు సాధించుకుని చివరకు ఎస్‌బిఐలో విలీనమైంది. విలీన ప్రక్రియ పూరె్తై శనివారం ఉదయానికి లోగోలు సైతం మారిపోవడంతో, ఎస్బీహెచ్ ఉద్యోగులు, ఖాతాదారుల్లో ఒక రకమైన ఉద్వేగపూరిత భావన కనిపించింది. ఎస్బీఐలో విలీన ప్రక్రియ గత మూడేళ్లుగా కొనసాగుతుండటం, దానికి సంబంధించి వేగవంతమైన ప్రయత్నాలు జరగటంతో ఎస్బీహెచ్ స్వర్ణోత్సవాలను సైతం పెద్దఎత్తున నిర్వహించలేదు. నిజానికి ఎస్బీఐలో విలీన ప్రక్రియవల్ల పదోన్నతులకు అవకాశాలు మెరుగుపడతాయి. కానీ ఇంతకాలం ఎస్బీహెచ్ అనే పేరును గర్వంగా చెప్పుకునే వాళ్లం. ఇప్పుడా పేరు మాయంకావడం ఏదో తెలీని వెలితిగా అనిపిస్తోంది’ అని ఎస్బీహెచ్ అధికారులు, సిబ్బంది అంటున్నారు. ఆధునిక హైదరాబాద్ నిర్మాతగా చరిత్రలో నిలిచిపోయిన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ 1941లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ స్టేట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నిజాం రాజ్య కరెన్సీ ఉస్మానియా సిక్కాను ఈ బ్యాంక్ నిర్వహించేది. ప్రస్తుత తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్ రాష్ట్రంలోని కొన్ని కర్నాటక ప్రాంతాలు, మహారాష్టల్రోని మరట్వాడ ప్రాంతాల్లో ఈ కరెన్సీ చెలామణిలో ఉండేది. ఆ కరెన్సీతోనే బ్యాంకు కార్యకలాపాలు సాగేవి. ప్రస్తుతం గన్‌ఫౌండ్రీలోని ప్రధాన కార్యాలయంలోనే ఏప్రిల్ 5, 1942లో పూర్తిస్థాయి బ్యాంకు కార్యాలయం ఆవిర్భవించింది. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్‌కు తొలి కార్యదర్శిగా మహమ్మద్ సలేహ అక్బర్ హైదరీ వ్యవహరించారు. ఆపరేషన్ పోలో తరువాత హైదరాబాద్‌ను భారత సైన్యం స్వాధీనం చేసుకునే నాటికి 50 శాఖలుండేవి. రాజాపన్నాలాల్ పిట్టి 1935లో ఏర్పాటు చేసిన మర్కంటైల్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను 1953లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్‌లో విలీనం చేశారు. 1953నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజెంట్‌గా ప్రభుత్వ, ట్రెజరీ ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం మొదలైంది. 1956లో హైదరాబాద్ స్టేట్ బ్యాంక్‌ను ఆర్బీఐ స్వాధీనం చేసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌గా పేరు మార్చింది.
ఎస్బీఐలో ఇతర బ్యాంకులను విలీనం చేయాలనే ప్రక్రియ 2016 నుంచీ వేగవంతమై ప్రస్తుత మార్చి 31నాటికి ముగిసింది. ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, భారతీయ మహిళా బ్యాంకులు ఎస్బీఐలో విలీనమయ్యాయి. బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అతి పెద్ద విలీన ప్రక్రియగా దీన్ని గుర్తిస్తున్నారు.