రాష్ట్రీయం

ఏసిబికి చిక్కిన అవినీతి తిమింగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 1: కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన ఆంధ్రప్రదేశ్ ఆర్‌అండ్‌బి చీఫ్ ఇంజనీర్ ఎం గంగాధరం (58)ను అవినీతి నిరోధక శాఖాధికారులు శనివారం అరెస్టు చేశారు. విశాఖ-్భమిలి రహదారి పనుల్లో భారీయెత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ బిజెపి శాసనసభపక్ష నేత పి విష్ణుకుమార్ రాజు ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) గంగాధరం, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై శనివారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ విలువ ప్రకారం 8.5 కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసిబి డిజిపి ఆర్‌పి ఠాకూర్ తెలిపారు. మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ వంద కోట్ల వరకు ఉంటుందని అంచనా. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన గంగాధరం ఆర్‌అండ్‌బి శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా
చేరి, తూర్పు గోదావరి, కృష్ణాజిల్లా, కర్నూలు, కడప, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర చోట్ల పనిచేశారు. గత ఏడాది నుంచి పదోన్నతిపై విజయవాడలోని ఆర్‌అండ్‌బి ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. ఆయనపై పలు ఫిర్యాదులు రావడంతో ఏసిబి అధికారులు పకడ్బందీగా దాడులు నిర్వహించారు. బెంగళూరు, హైదరాబాద్‌తోపాటు ఏపిలోని విజయవాడ, కడప, చిత్తూరు, విశాఖ, నెల్లూరు పట్టణాల్లో సోదాలు చేశారు. ఆయన నివాసంలో తనిఖీలు చేసి ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే గృహోపకరణాలను, హైదరాబాద్ సనత్‌నగర్‌లోని హెచ్‌డిఎఫ్‌సి, ఇంగ్ వైశ్యా బ్యాంకులకు చెందిన ఐదు లాకర్లనుంచి కోట్ల రూపాయల విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లిలోని మరో బ్యాంకు లాకర్‌ను అధికారులు తెరవాల్సి ఉంది.
గంగాధరం పేరుతో ఎర్రగుంటపల్లిలో లక్షా 57వేల రూపాయలు విలువ చేసే 1.02 సెంట్లు భూమి ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతని ఇంట్లో 45లక్షల నగదుతోపాటు, 15లక్షలు విలువైన 500 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. భార్య ఉమామహేశ్వరి, కొడుకు చైతన్య తేజ్, కోడలు శ్రీజ, కుమార్తె ప్రియదర్శిని, అల్లుడు దీపక్, మామ రామసుబ్బారెడ్డిల పేర్లమీద కూడా భారీగా ఆస్తులున్నట్టు సోదాల్లో బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసిబి డిజిపి తెలిపారు.

చిత్రం..ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ గంగాధరం బినామీ కాంట్రాక్టర్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న దృశ్యం