రాష్ట్రీయం

మంత్రి కొడుకు మందు వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 1: మద్యం మత్తులో ఒక ప్రైవేటు డ్రైవర్‌పై గిరిజన, పర్యాటక శాఖల మంత్రి చందూలాల్ కుమారుడు చేయిచేసుకున్న సంఘటన శనివారం రాత్రి సంచలనమైంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వరంగల్ రూరల్ జిల్లా గూడేపాడుకు చెందిన నరేష్ గతంలో పోలీసు స్టేషన్ జీపు డ్రైవర్‌గా పనిచేసాడు. శనివారం రాత్రి గూడేపాడు సమీపంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న సమయంలో ములుగు నుంచి హన్మకొండకు వస్తున్న మంత్రి చందూలాల్ తనయుడు ధరంసింగ్ తన కారును ఆపి నరేష్‌పై దాడిచేసి చితకబాదాడు. తాను మంత్రి కొడుకునని తెలియదా? రోడ్డుపైన అడ్డదిడ్డంగా నడుస్తావా? అంటూ చేయిచేసుకున్నాడు. దాంతో నరేష్ తాను పోలీసు స్టేషన్‌లో జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్నానని చెప్పగా, పోలీసులైతే ఏంచేస్తారురా అంటూ మళ్లీ కొట్టాడు. దీన్ని గమనించి స్థానికులు అక్కడకు చేరుకుని నరేష్ చేసిన తప్పేమిటని మంత్రి తనయుడిని నిలదీసారు. విషయం తెలిసి ఆత్మకూరు ఎస్సై వెంకటప్పయ్య సంఘటన ప్రాంతానికి చేరుకుని ఆగ్రహంతో ఉన్న జనాలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా మంత్రి కుమారుడు అయితే తమకేమిటని, ఇష్టం వచ్చినట్లు కొడితే ఊరుకోవాలా అని ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంలో మంత్రి కుమారుడిపై కొందరు గ్రామస్థులు చేయిచేసుకున్నారు. దాంతో ఆత్మకూరు సిఐ అక్కడకు చేరుకుని స్థానికులతో సంఘటన వివరాలు తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మంత్రి తనయుడు ధరంసింగ్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు.

చిత్రం..వివరాలను గ్రామస్థులను అడిగి తెలుసుకుంటున్న పోలీసు అధికారులు