రాష్ట్రీయం

సమాజం కోసమే కవి తపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కాచిగూడ, ఏప్రిల్ 2: సమాజాభివృద్ధి కోసం కవి నిరంతరం తపిస్తాడని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీ అన్నారు. వేదోపనిషత్తులతోనే భారత దేశం ప్రగతిపథంలో నడుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వంశీ ఇంటర్నేషనల్ సాహిత్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సినీ గేయ రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీకి ‘సినీ గేయ సమ్రాట్’ బిరుదు, ఉగాది జీవిత సాఫల్య పురస్కారం ప్రదానంతోపాటు ఆదర్శ దంపతుల సత్కారం, వంశీ టాలీవుడ్ ఫిలిం అవార్డు- 2016 ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం సాయం త్రం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. తనకు జరిగిన అపూర్వ సత్కారం అనిర్వచనీయమైన అనుభూతినిచ్చిందని సిరివెనె్నల అన్నారు. వంశీ సంస్థ అనాథ పిల్లలను చేరదీసి వారి అభ్యున్నతికి చేస్తున్న కృషికి తాను ఆకర్షితుడనయ్యానని చెప్పారు. దైవభక్తి, దేశభక్తి ఉన్న గొప్ప యోగి విశ్వంజీ మహరాజ్ అని పేర్కొన్నారు. నేటి ప్రసార ప్రచార మాధ్యమాలు కేవలం వ్యాపార దృక్పథంతో నడుస్తున్న తరుణంలో ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ తన సంపాదకీయాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారన్నారు.
వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వంజీ మహరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచ దేశాలను శాసిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధానికి రెడ్‌కార్పెట్ వేసి ఆహ్వానించే రోజు త్వరలోనే వస్తుందన్నారు. మనిషి సన్మార్గంలో నడవడానికి మేథాశక్తి ఎంతో అవసరం అన్నారు. ఇప్పుడు దేశాన్ని మంచి నాయకత్వం నడిపిస్తోందని మేథావులు సమష్టిగా దేశ నాయకత్వానికి తోడ్పాటును అందించి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ సిరివెనె్నల పాటలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయన్నారు. ఆయన రాసిన ‘జగమంత కుటుంబం నాది’ అన్న పాట తన జీవితంలో మరపురానిదని వెంకటేశం అన్నారు. సమాజ సేవలో భాగంగా వంశీ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను కూడా ఆయన అభినందించారు. వంశీ రామరాజు మాట్లాడుతూ సిరివెనె్నల సినిమాతోనే ఇంటిపేరును సిరివెనె్నలగా మార్చుకున్న ఘనత సీతారామశాస్ర్తీకి దక్కిందన్నారు. ఆయన రాసిన వేల పాటలు మరపురానివని, సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. సిరివెనె్నల దంపతులకు ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ దంపతులు నూతన వస్త్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ నటి జమున రమణరావు, సినీ నిర్మాత క్రిష్, సినీ సంగీత దర్శకుడు ఇఎస్ మూర్తి, ఎన్‌సిఎస్ షుగర్స్ లిమిటెడ్ చైర్మన్ నారాయణం నాగేశ్వరరావు, సీల్‌వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు, చాగంటి శరత్‌బాబు, గానసభ అధ్యక్షుడు కళావెంకట దీక్షితులు, సాహితీవేత్త డాక్టర్ తెనే్నటి సుధాదేవి, వంశీ సంస్థ ప్రతినిధులు రాగమయి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు. సభకు ముందు ప్రముఖ గాయకులు రామకృష్ణ యనమండ్ర, శివశంకరి గీతాంజలి సమర్పణలో నిర్వహించిన సిరివెనె్నల సినీ సంగీత విభావరి ఆహూతులను అలరించింది.

చిత్రం.. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీకి ‘సినీ గేయ సమ్రాట్’ బిరుదు ప్రదానం చేస్తున్న విశ్వయోగి విశ్వంజీ మహరాజ్, చిత్రంలో వంశీరామరాజు, ఆంధ్రభూమి ఎడిటర్ ఎం.వి.ఆర్ శాస్ర్తీ, తెలంగాణ టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సినీనటి జమున ఉన్నారు.