రాష్ట్రీయం

చినబాబుకు ఐటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 3:ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్‌కు మంత్రివర్గంలో కీలక శాఖలు లభించాయి. ఆయనకు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్‌తోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను అప్పగించారు. కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి సోమవారం శాఖలు కేటాయించారు. అలాగే పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు చేశారు. శిద్దా రాఘవరావు, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు సహా పలువురి శాఖలను మారాయి. ఉప ముఖ్యమంత్రులు కెఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నారాయణ, మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ శాఖల్లో మార్పేమీ లేదు. అచ్చెన్నాయుడికికు ప్రమోషన్ లభించింది.
*
మంత్రులు - శాఖలు

ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు: ఇనె్వస్ట్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మైనార్టీ వెల్ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్, సినిమాటోగ్రఫీ, హ్యాపీనెస్ ఇండెక్స్, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు.
కెఇ కృష్ణమూర్తి: ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్
నిమ్మకాయల చినరాజప్ప: ఉప ముఖ్యమంత్రి, హోం, విపత్తు నిర్వహణ
యనమల రామకృష్ణుడు: ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ టాక్స్ అండ్ లెజిస్లేటివ్ ఎఫైర్స్
నారా లోకేష్: పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్
కిమిడి కళా వెంకట్రావు: విద్యుత్
అచ్చెన్నాయుడు: రవాణా, బిసి సంక్షేమం, ఎంపవర్‌మెంట్, హాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్
సుజయ కృష్ణ రంగారావు: గనులు, భూగర్భశాఖ
అయ్యన్నపాత్రుడు: రోడ్లు, భవనాలు
గంటా శ్రీనివాసరావు: మానవ వనరుల అభివృద్ధి, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ
కొత్తపల్లి శామ్యూల్ జవహర్: ఎక్సైజ్
పితాని సత్యనారాయణ: కార్మిక, ఉపాధి, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్
పైడికొండల మాణిక్యాలరావు: దేవాదాయశాఖ
కామినేని శ్రీనివాసరావు: ఆరోగ్యశాఖ, మెడికల్
ఎడ్యుకేషన్
కొల్లు రవీంద్ర: లా అండ్ జస్టిస్, స్కిల్ డెవలప్‌మెంట్, యూత్ స్పోర్ట్స్, అన్‌ఎంప్లాయిమెంట్ బెన్‌ఫిట్స్:
ఎన్‌ఆర్‌ఐ ఎంపర్‌మెంట్ అండ్ రిలేషన్స్
దేవినేని ఉమామహేశ్వరరావు: జలవనరుల నిర్వహణ
నక్కా ఆనంద్‌బాబు: సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, సాధికారిత
ప్రత్తిపాటి పుల్లారావు: పౌరసరఫరాలు, కస్టమర్ వ్యవహారాలు, ధరల నియంత్రణ
శిద్దా రాఘవరావు: అటవీశాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ
పొంగూరు నారాయణ: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పట్టణాభివృద్ధి, అర్బన్ హౌసింగ్
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి: వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, అగ్రి ప్రాసెసింగ్
చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి: మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్థక, డైరీ డెవలప్‌మెంట్, ఫిషరీష్ అండ్ కోఆపరేటివ్స్
భూమా అఖిలప్రియారెడ్డి: టూరిజం, తెలుగు భాష, సంస్కృతి
కాల్వ శ్రీనివాసులు: సమాచారశాఖ, రూరల్ హౌసింగ్
పరిటాల సునీత: మహిళా సాధికారత, శిశు సంక్షేమం, వికలాంగ, వృద్ధుల సంక్షేమం
ఎన్ అమర్‌నాథ్‌రెడ్డి: భారీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిబిజినెస్, కామర్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్

చిత్రం..మంత్రి నారా లోకేష్