రాష్ట్రీయం

హద్దు మీరితే వేటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 3: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత పార్టీలో పెల్లుబుకిన అసంతృప్తిపై తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లు ఎక్కడికక్కడ నచ్చచెప్పే బాధ్యత తీసుకోవాలని, ప్రజలు బాగుండాలంటే పార్టీ బాగుండాలని, టిడిపి ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ అని మర్చిపోకూడదని స్పష్టం చేశారు. సోమవారం ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రివర్గ అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మంత్రివర్గాన్ని ఖరారు చేశానన్నారు. పదవులు ఆశించడంలో తప్పులేదని, అసంతృప్తి హద్దు దాటకూడదని, కానీ అంతిమంగా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే పార్టీ వేదికలపైనే చర్చించుకోవాలే తప్ప, బయట మాట్లాడటం తగదని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షరీఫ్ మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమ శాఖను మీవద్ద గానీ, లోకేష్ వద్దగానీ ఉంచాలని సూచించగా, షరీఫ్ సూచన బాగుందని మెచ్చుకున్నారు. కొన్ని కారణాల వల్ల మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వలేకపోయామని, అయినా క్యాబినెట్ హోదా గల పదవి ఒకటి ఇచ్చి మైనారిటీ సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళతామని హామీ ఇచ్చారు. కొందరు తమ సొంత సమస్యలను పార్టీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, క్రమశిక్షణ గల పార్టీగా ఉన్న టిడిపి పేరుకు మచ్చ తీసుకురావాలని ప్రయత్నిస్తే సహించేది లేదని, అవసరమైతే వారిని వదులుకునేందుకు సైతం సిద్ధమేనని స్పష్టం చేశారు. యరపతినేని, వర్మ, ఆలపాటి రాజా హుందాగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. ఇది సమతూకంతో చేసిన కూర్పు అని, రాజ్యసభ, కౌన్సిల్ ఎన్నికల్లో పాటించే విధానానే్న మంత్రివర్గంలోనూ పాటించారని, గత కొద్దిరోజుల నుంచి బాబు జిల్లాలవారీగా నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు విశే్లషించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వ్యక్తమయ్యాయి.