రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి వెబ్ పోర్టల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం కోసం వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను సోమవారం ఆదేశించింది. జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్‌వి భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌కు మాత్రమే టెండర్ల ఈ-పోర్టల్‌ను రూపొందించామని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేయడంతో న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. మొత్తం 224 ఆస్తులను గుర్తించామని, అందులో చాలా ఆస్తులు 50 కోట్ల లోపు విలువైనవని, తొమ్మిది ఆస్తులు మాత్రమే 50 కోట్లకు మించి ఉన్నాయని ప్రత్యేక కౌన్సిల్ కృష్ణ ప్రకాష్ పేర్కొన్నారు. దర్యాప్తు పేరుతో సిఐడి అధికారులు అగ్రిగోల్డ్ కంపెనీ కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆ కంపెనీ సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ ఆరోపించారు.
యోచించి చెబుతాం
హైకోర్టుకు శాశ్వత ప్రధాన న్యాయమూర్తిని, న్యాయమూర్తులను నియమించాలని కోరుతూ ఎస్ సత్యంరెడ్డి దాఖలుచేసిన ప్రజావ్యాజ్య పిటిషన్‌ను అంగీకరించాలా లేదా అన్నది యోచించి చెబుతామని జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ జె ఉమాదేవిలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. ఆర్టికల్ 216 ప్రకారం ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగి 22 నెలలు గడిచినా శాశ్వత ప్రధాన న్యాయమూర్తిని నియమించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.