రాష్ట్రీయం

వైభవంగా అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం వైభవంగా, కన్నులపండువగా జరిగాయి. ముందుగా ఉదయం స్వామికి గర్భగుడిలో సుప్రభాత సేవ చేశారు. ముత్యాలు పొదిగిన వస్త్రాలతో అలంకరించి ముత్తంగి సేవ చేశారు. బాలభోగం సమర్పించారు. అనంతరం యాగశాలలో అగ్నిమథనం కార్యక్రమం వేదోక్తంగా ప్రారంభించి, మథించిన అగ్నిని గర్భగుడిలో మూలవరులకు చూపించి ఆశీర్వచనం తీసుకుని యాగశాలలోని హోమగుండంలో ప్రతిష్ఠించారు. తర్వాత గరుత్మంతుడి చిత్రపటాన్ని మంగళవాయిద్యాల మధ్య స్వామి వెంట ధ్వజస్తంభం వద్దకు తీసుకెళ్లారు. స్వామి సన్నిధిలో గరుత్మంతుడికి ప్రత్యేకారాధనలు చేసి గరుడ ముద్దలను నైవేద్యంగా పెట్టారు. అనంతరం వాటిని సంతానం లేని మహిళలకు పంపిణీ చేశారు. మూలవరులను దర్శించుకున్న మహిళలు గరుడ ముద్దలను ఆలయం వెనుక భాగంలోకి తీసుకెళ్లి తిన్నారు. దీనివల్ల వారికి సంతానప్రాప్తి కలుగుతుందని శాస్త్రం. గరుత్మంతుడి చిత్రపటాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య ధ్వజస్తంభం పైకి అధిరోహించారు. కన్నులపండువగా ధ్వజావరోహణం జరిగింది. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

చిత్రం..ధ్వజస్తంభం వద్ద గరుత్మంతుడికి పూజలు