రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ ఆస్తులు 233

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ఆకర్షణీయమైన వడ్డీలతో ప్రజల నుంచి కోట్లాదిరూపాయల డిపాజిట్లు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టిన అగ్రిగోల్డ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో అగ్రిగోల్డ్‌కు చెందిన 233 ఆస్తులను ఏపి సిఐడి అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ. 2700 కోట్లని సిఐడి పేర్కొంది. ఆస్తుల వివరాల జాబితాను సిఐడి అధికారులు హైకోర్టుకు మంగళవారం సమర్పించారు. అగ్రిగోల్డ్‌కు చెందిన 9 ఆస్తుల మార్కెట్ విలువను అధ్యయనం చేశామని, గుంటూరు-విజయవాడ మధ్య ఉన్న హాయ్‌లాండ్ ఆస్తుల విలువ రూ. 600కోట్లని కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. చినకాకాని వద్ద ఉన్న హాయ్ ల్యాండ్ రిసార్ట్స్ 85.13ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు కనుగొన్నామని సిఐడి పేర్కొంది. విజయవాడలో అగ్రిగోల్డ్ కంపెనీకి 12,543 గజాల స్ధలం, కృష్ణా జిల్లాలో కీసర వద్ద 324 ఎకరాల స్ధలం ఉందని సిఐడి పేర్కొంది. ఫ్రకాశం జిల్లా టంగుటూరు వద్ద క్లారియన్ విద్యుత్ సంస్ధకు చెందిన 51.26 ఎకరాలు, అదే జిల్లాలో హసనపురం వద్ద సింగరాయ గ్రీన్ పవర్ జెన్కో కార్పోరేషన్ వద్ద 741.12 ఎకరాలు, రాజమండ్రిలో ఓపెన్ ప్లాట్లు 40.99 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 141.15 ఎకరాలు, కృష్ణా జిల్లాలో నూజివీడు వద్ద 110 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 570.75 ఎకరాల స్థలం ఉందని సిఐడి నివేదికలో పేర్కొంది.
తొలి దశలో గుర్తించిన 9 ఆస్తులను హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత వేలం వేస్తామని సిఐడి పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో వేరువేరు ప్రాంతాల్లో మరో 224 ఆస్తులు ఉన్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని సిఐడి పేర్కొంది. తెలంగాణ సిఐడి అధికారులు కూడా తాము రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించే పనిని ప్రారంభించామని, కోర్టుకు త్వరలోనే నివేదిక ఇస్తామని తెలిపారు.