రాష్ట్రీయం

ఎస్పీ బాలుకు ఎన్టీఆర్ అవార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 4: తెలుగు చలనచిత్ర జాతీయ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2012-13 సంవత్సరానికి గాను ఈ అవార్డులు ప్రకటించగా, సినిమా రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు పురస్కారంగా లభించే నటరత్న నందమూరి తారక రామారావు జాతీయ అవార్డు (2012)కు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. ఇక 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించిన నేపథ్య చలనచిత్ర అవార్డులను త్వరలో ప్రకటిస్తామని నటుడు మురళీ మోహన్ తెలిపారు. ఈ ఐదేళ్ల అవార్డులను ఒకేసారి ప్రదానం చేస్తామన్నారు. అవార్డులను ప్రముఖ నటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ ప్రకటించారు. ఎఫ్‌డిసి ఎండి ఎస్ వెంకటేశ్వర్‌తో కలిసి ఆయన ఈ జాబితాను విడుదల చేశారు.