రాష్ట్రీయం

దళారులు, లంచగొండులను చెప్పుతో కొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 4: ప్రభుత్వం ఆమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతోపాటు పేదల ఆత్మగౌరవం కోసం సిఎం కెసిఆర్ ఇస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో లంచం అడిగినవారిని ప్రజలు చెప్పులతో కొట్టాలని రాష్ట్ర ఐటి, మున్సిపల్, పరిశ్రమల మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. లంచమనే సంస్కృతిని కాంగ్రెస్ నేతలు ఈ గడ్డపైకి తీసుకొచ్చి బ్రోకర్లు, దళారులను పెంచిపోషించారని ద్వజమెత్తారు. ఇప్పుడు నడిచేది బ్రోకర్లు, మధ్యదళారుల రాజ్యం కాదు. గత కాంగ్రెస్ హయంలో ఆ పార్టీ నేతలు లంచాలిస్తేనే పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చారు. కానీ ఇప్పుడలాంటి బ్రోకర్ దందాలు ఇక్కడ నడవవు. ఎవరైనా డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగితే అలాంటి వారిని చెప్పులతో కొట్టండి’ అని కెటిఆర్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి కెటిఆర్, మంగళవారం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దివిటిపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న వెయ్యి డబుల్ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నేతలు గతంలో తూతూమంత్రంగా ఇందిరమ్మ పేరిట పిట్టగూళ్లు నిర్మించారని ఎద్దేవా చేశారు. అందులోనూ బ్రోకర్లు, మధ్యదళారులదే పెత్తనం సాగిందని, కోట్లాది రుపాయల ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి పాల్పడిన ఘనులు కాంగ్రెస్ నేతలని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ పేదల ఆత్మగౌరవం కోసం రూ.18వేల కోట్ల ఖర్చుతో 2.65 లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని అన్నారు. అందులో భాగంగా ఒక్క మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఈ ఏడాది 2300 ఇళ్లు ప్రత్యేకంగా కెసిఆర్ మంజూరు చేశారని, వాటిలో వెయ్యి ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏ రాష్ట్రంలో గృహ నిర్మాణం విషయంలో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి పేదల కోసం డబుల్ బెడ్‌రూంలు నిర్మిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దేశవ్యాప్తంగా డబుల్ బెడ్‌రూంల నిర్మాణానికి మంచి ప్రశంసలు అందుతున్నాయని, దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆరోపించారు. అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక కాంగ్రెస్, మిగతా ప్రతిపక్షాల నేతలు కళ్లలో కట్టెపెట్టి తమాషా చూస్తున్నారని విమర్శించారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పేరుకున్న గబ్బును తెరాస ప్రభుత్వం తొలగించే పనిలో ఉందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి పెండింగ్ ప్రాజెక్టులతో పాటు పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి 14 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి తీరుతామన్నారు. గత ఏడాది నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, దాంతో పాలమూరు పచ్చబడిందన్నారు. దీన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నేతలు కడుపుమంటతో ముఖ్యమంత్రిపై, తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలు చైతన్యవంతులయ్యారని, ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఆటలు సాగవని హెచ్చరించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపి జితేందర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..దివిటిపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కెటిఆర్