ఆంధ్రప్రదేశ్‌

కొత్తగా నిఘా కార్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ రాష్ట్రంలో నిఘా వ్యవస్ధను పటిష్టం చేసేందుకు హోంశాఖ ప్రణాళికను ఖరారు చేసింది. ఆరు చోట్ల కొత్తగా ప్రాంతీయ నిఘా కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్, రాచకొండ, రామగుండం, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్ పోలీసు కమిషనరేట్లలో ఆరు ప్రాంతీయ నిఘా విభాగాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం పది జిల్లాల్లో మూడు ప్రాంతీయ నిఘా కార్యాలయాలు, పది జోనల్ ఇంటెలిజెన్స్ యూనిట్లు పనిచేసర్తున్నాయి. ప్రతి నిఘా కార్యాలయంలో నాలుగు విభాగాలను ఆధునీకరించనున్నారు. సెక్యూరిటీ వింగ్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, మెయిన్ ఇంటెలిజెన్స్ విభాగాలు పనిచేస్తున్నాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం కదలికలను పసిగట్టడంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర వహిస్తోంది. ఈ విభాగం దేశంలోని ఇతర రాష్ట్రాల నిఘా విభాగాలతో సమాచారాన్ని పంచుకుంటుంది.