ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి కూలీలకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 7: రాష్ట్ర ఐటి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ తన తొలి రాజకీయ అడుగు పేదల వైపు ఉంటుందన్న సంకేతాలిచ్చారు. మంత్రిగా ఆయన తొలిరోజు పేదల జీవితాలకు సంబంధించిన మూడు ఫైళ్లపై సంతకం చేశారు. ఉపాధి హామీ పథకంలో ఏడాదిలో 50 రోజులు పనిచేసిన కుటుంబాలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించాలన్న డిమాండ్ సుదీర్ఘకాలం నుంచి వినిపిస్తోంది. దానికి సంబంధించి కార్మిక సంఘాలు, పలువురు ప్రజాప్రతినిధులు చాలాకాలం నుంచి ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు.
లోకేష్ మంత్రిగా అదే ఫైలుపై తొలి సంతకం చేశారు. వారు పెళ్లి చేసుకుంటే పదివేలు, ప్రసూతికి 20 వేలు, ప్రమాద బీమాకు 5లక్షల రూపాయలిచ్చే ఫైలుపై సంతకం చేయడం ద్వారా తాను పేదలు, కార్మికుల పక్షాన ఉంటానన్న సంకేతాలిచ్చారు. ఇక పంచాయతీరాజ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన మరో ఫైలుపైనా లోకేష్ సంతకం చేశారు. ఉదయం మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన లోకేష్‌కు టిటిడి నుంచి వచ్చిన డాలర్ శేషాద్రి ఆశీర్వాదాలిచ్చారు. ఆయనతోపాటు, మరికొందరు వేదపండితులు వచ్చి చినబాబుతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఆయనను మంత్రులు అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవరావు, దేవినేని ఉమ, ఎమ్మెల్సీ కరణం బలరాం, పయ్యావుల కేశవ్, బాబూ రాజేంద్రప్రసాద్ తదితరులు అభినందనలతో ముంచెత్తారు.
నీటి సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్: లోకేష్
రాష్ట్రంలో వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో ఎలాంటి నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి లోకేష్ మీడియాకు చెప్పారు. అందులో భాగంగా ఒక కంట్రోల్‌రూమ్ ఏర్పాటుచేసి, దానికి టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తామని, వాటి వివరాలు రెండు మూడు రోజుల్లో వెల్లడిస్తామన్నారు. ఎన్టీఆర్ జలసిరిని క్లస్టర్‌గానా.. మరే విధంగా అమలుచేయాలా అన్నది ఆలోచిస్తున్నామన్నారు.

చిత్రం... మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న లోకేష్