తెలంగాణ

చిక్కులకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: భూ సేకరణపై తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టానికి కేంద్రం నుంచి త్వరలోనే క్లియరెన్స్ వస్తుందని, సమస్యలు అన్నీ తీరిపోతాయని సిఎం కె చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల సమస్యలపై ప్రగతి భవన్‌లో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. భూసేకరణ కోర్టు కేసులు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆవరోధంగా మారిన అంశంపై సమావేశంలో చర్చించారు. ‘చిక్కులన్నీ తొలగిపోతాయి. మనం చేసిన చట్టం కేంద్రానికి పంపాం. అక్కడి నుంచి క్లియరెన్స్ వస్తుంది. ఆ చట్టం వల్ల రైతులకు మేలు ఎక్కువగా జరుగుతంది’ అని సిఎం తెలిపారు. దీనివల్ల భూ సేకరణ వేగవంతమవుతుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత లేదని, కావలసిన డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, నీరు పంట పొలాలకు అందించడానికి కాలువలు బాగుండాలని, ఎల్‌ఎండి ఎగువన, దిగువన ఉన్న కాలువలను పూర్తి స్థాయి ప్రవాస సామర్థ్యానికి తగ్గట్టు తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి ఎత్తి పోతల పథకం కాలువలను మెరుగు పరచాలి, వాటి పరిస్థితి పరిశీలించి కాల్వలను వెడల్పు చేయడమా? కొత్త కాలువలు తవ్వడమా? అనే అంశాలపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవడానికి ఇంజనీర్లతో కమిటీ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక జోక్‌గా మారాయని అన్నారు. ప్రాజెక్టులున్నా నీరుండదు, నీరుంటే కాల్వలు ఉండవని చెప్పారు. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడగానే ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులపై దృష్టిసారించినట్టు చెప్పారు. ఇప్పటికే గడ్డెన్న వాగు ప్రాజెక్టు ద్వారా పదివేల ఎకరాలకు నీరిచ్చినట్టు చెప్పారు. సాత్నాల, ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టులను వచ్చే జూలై నాటికి పూర్తి చేయనున్నట్టు చెప్పారు. చెరువులు బాగు చేయడం, కొత్త చెరువుల నిర్మాణం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 70 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చినట్టు హరీశ్‌రావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మీడియం ప్రాజెక్టులను వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేయనున్నట్టు చెప్పారు. మిషన్ కాకతీయ 3 ద్వారా ఈసారి ఆరువేల చెరువును పునరుద్ధరించనున్నట్టు తెలిపారు.
ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పూర్తయ్యేంత వరకు ఎదురు చూడకుండా నదీ జలాలను చెరువులకు తరలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీని వల్ల భూ గర్భ జలాల మట్టం పెరుగుతుందని, బోర్ల ద్వారా వ్యవసాయం సాగుతుందని చెప్పారు. తెలంగాణలో 25లక్షల బోర్లు ఉన్నాయి, వాటికి కావలసిన కరెంటు కూడా ఇస్తున్నట్టు, భూ గర్భ జలాలు పెరగడం అవసరం అని చెప్పారు. ఎక్కడ వీలైతే అక్కడ చెరువులు నింపడం ముఖ్యమైన పనిగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రాజెక్టుల పనులు పెద్ద ఎత్తున చేస్తున్నందున రిటైర్డ్ ఇంజనీర్ల సేవలు వినియోగించుకోవాలని, రిటైర్ కాబోతున్న వాళ్లు ఆసక్తి చూపిస్తే వారికి ఎక్స్‌టెన్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అవసరమై కొత్త ఉద్యోగాలను కూడా నియమిస్తామని, పంపింగ్ స్టేషన్లు, ఇన్‌టేక్ వెల్స్ నిర్వహించడానికి విద్యుత్ ఇంజనీర్లను నియమించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.