రాష్ట్రీయం

14వరకూ సామాజిక సామరస్యతా వారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: దేశవ్యాప్తంగా బిజెపి ఆదరణను మరింతగా పెంచడంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని మరింత చైతన్య పరిచేందుకు బిజెపి దేశవ్యాప్తంగా సామాజిక సమరత కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఈనెల 14 వరకూ నిర్వహిస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. అన్ని లోక్‌సభ , శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజలను సమీకరించి, వారిలో పార్టీ భావాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి వారిలో సానుకూల వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు ఈ సామాజిక సమరసత కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 120 లోక్‌సభ నియోజకవర్గాలను ఇప్పటికే పార్టీగుర్తించింది. ఈ నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీ కార్యకర్తల సదస్సులను నిర్వహిస్తారు. ప్రతి సదస్సుకు కేంద్ర మంత్రి లేదా జాతీయ స్థాయి నాయకులను పంపించి పార్టీ ఇటీవల సాధించిన ఘన విజయాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తారు. యుపిలో ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో గెలవగా లేనిది తెలంగాణలో ఎందుకు గెలవలేమనే భావనతో పార్టీ ఈసదస్సులకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ సోమవారం నాడు పాత్రికేయులకు వివరించారు. హైదరాబాద్ ఎంపి స్థానాన్ని గెలవడమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నామని లక్ష్మణ్ చెప్పారు.
ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపి పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో కూడా బిజెపినే గెలిచిందని అన్నారు. ముంబై, ఛండీఘర్ వంటి అత్యధిక అక్షరాస్యత ఉన్న ప్రాంతాల్లో కూడా బిజెపి విజయం సాధించిందని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారని ఆయన వెల్లడించారు. భాజపా విస్తృతస్థాయి సమావేశంలో అమిత్‌షా కూడా పాల్గొంటారని తెలిపారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో బిజెపి పట్ల సానుకూల వాతావరణం నెలకొందని చెప్పారు. సోమవారం నాడు ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. పూర్తికాలం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించి వారికి కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై సమగ్ర అవగాహన కల్పిస్తామని ఈ నెల 7వ తేదీన అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సదస్సులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో సైతం బిజెపి గెలిచిందని, అదే రీతిన హైదరాబాద్‌లోనూ సాధ్యమవుతుందని, అందుకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. పురుషోత్తం రూపాల కరీంనగర్ కార్యకర్తల సమావేశానికి వస్తున్నారని అన్నారు. టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. నితిన్ గడ్కారీ నిజామాబాద్ పార్లమెంటు సదస్సుకు, అనంతకుమార్ మహబూబ్‌నగర్ సదస్సుకు, భువనగిరి సదస్సుకు ప్రకాష్ జవదేకర్ హాజరవుతారని పేర్కొన్నారు. పొన్ను రాధాకృష్ణ వరంగల్ పార్లమెంటు సదస్సుకు వస్తారని, కె హరిబాబు మెదక్ పార్లమెంటు సదస్సుకు హాజరవుతారని, మల్కాజ్‌గిరి సదస్సుకు మురళీధరరావు వస్తారని, సికింద్రాబాద్ పార్లమెంటుకు దత్తాత్రేయ నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి నుండే ఎన్నికలకు వ్యూహాత్మకంగా ప్రణాళిక రచించామని అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీ కార్యకర్తల సమ్మేళనాలను పకడ్బందీగా రూపొందించామని, వీటికి సమన్వయ కర్తలుగా నలుగురు ప్రధానకార్యదర్శులను నియమించామని అన్నారు. పార్లమెంట్‌ల వారీ రామచంద్రరావు, భువనగిరి పార్లమెంటుకు నల్లు ఇంద్రసేనారెడ్డి, వరంగల్‌కు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్‌కు, నిజామాబాద్‌కు ఎండల లక్ష్మీనారాయణ, కరీంనగర్‌కు కిషన్‌రెడ్డి, మెదక్ పార్లమెంటుకు చింతల రామచంద్రారెడ్డి, పేరాల చంద్రశేఖరరావు మహబూబ్‌నగర్‌కు నాగం జనార్ధనరెడ్డి ఇన్‌చార్జిలుగా ఉంటారని పేర్కొన్నారు.