తెలంగాణ

సమ్మె విరమించిన లారీ ఓనర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: తెలంగాణ లారీ యజమానుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న లారీ యజమానులు సమ్మె విరమించారు. తెలంగాణ లారీ యజమానుల సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా లారీ యజమానులు పెట్టిన డిమాండ్లలో 15 డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లారీల పార్కింగ్ కోసం రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ వద్ద 10 ఎకరాల 37 గుంటల స్థలాన్ని ట్రక్ ఆపరేటర్లు హైవే ఎమినిటీస్ సొసైటీకి అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అదేవిధంగా మూసాపేట్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లోని లారీల పార్కింగ్ కోసం స్థలాల కోసం హెచ్‌ఎండిఎ కమిషనర్ పరిశీలిస్తారు. వాహనాల కాలుష్యంపై డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, వాహన లోడింగ్, అఫ్‌లోడింగ్ యజమానులు చెల్లిస్తున్న డబ్బులు సరకు రవాణా చేసే వ్యాపారి నుంచి ఈ డబ్బులు వసూలు చేసేందుకు ఆయా శాఖలకు పరిశీలన కోసం పంపడమైంది. ఓవర్ లోడింగ్ అధిక బరువు రవాణా మీద మోటారు చట్ట ప్రకారం లారీల యజమానుల పైనే కాకుండా రవాణాదారుపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణా పాఠశాలలు ఏర్పాటుకు దశల వారీగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే (సెక్షన్ 304ఎ) కింద పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకునే విధానంలో మార్పులు చేసేం అంశం పరిశీలన కోసం డిజిపికి నివేదిస్తారు. లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు తదితర అంశాలలో రవాణా వాహనాలనకు స్లాట్ విధానం అమలు కోసం తెలంగాణలో లారీ యజమానుల అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు లారీల స్లాట్ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. జాతీయ స్థాయిలోని సమస్యలపై ఇతర రాష్ట్రాల సమస్యలపై కేంద్రంతో పాటు రాష్ట్రాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. జాతీయ పర్మిట్లు పొందిన లారీలు ఏవైనా నిలిచిపోతే జాతీయ పర్మిట్‌కు సంబంధించిన కంపోజిట్ ఫీజు బకాయిలు మాఫీ చేసే అంశంపై కమిటీ 15 రోజుల్లో పరిశీలించి నివేదించేందుకు, చెక్ పోస్టుల ఆధునీకరణ దశల వారీగా చర్యలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇలాఉండగా మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ లారీ యజమానుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. జాతీయ స్థాయి పర్మిట్ కోసం చర్యలు తీసుకుంటామని, సింగిల్ పర్మిట్ కోసం ఎపి ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, చెక్ పోస్టుల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చర్చల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు జగన్నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, కార్యదర్శి చాంద్ పాషా, కోశాధికారి గణేష్ యాదవ్, సంయుక్త కార్యదర్శి సలీం, కార్యనిర్వాహక కార్యదర్శి రామచంద్రా రెడ్డి, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.