రాష్ట్రీయం

జిఎస్‌టితో ఎంతో మేలు : నిర్మలా సీతారామన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: జిఎస్‌టితో ప్రజలపై పన్నుల భారం తగ్గనున్నదని కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జిఎస్‌టి అమలులోకి రాగానే విదేశాల నుంచి దిగుమతి అయ్యే వివిధ వస్తువుల కంటే మన దేశీయ వస్తువుల ధరలు మరింత చౌకగా లభిస్తాయని ఆమె తెలిపారు. శనివారం యంగ్ ‘్ఫక్కీ’ మహిళా సంస్ధ (వైఎఫ్‌ఎల్‌వో) నగరంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖా-ముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఫిక్కీ, వైఎఫ్‌ఎల్‌ఒకు చెందిన పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. జిఎస్‌టి వల్ల పన్నుల భారం తగ్గుతుందని అన్నారు. నిజం చెప్పాలంటే జిఎస్‌టి బిల్లు రూపొందించినప్పటి నుంచి అనేక మార్పులు చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సహజమేనని అన్నారు. ఈ బిల్లు ఆమోదం కోసం అన్ని పార్టీలూ మద్ధతునివ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. అయితే రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉందని అన్నారు. ఈ బిల్లు ద్వారా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. బిల్లుకు మద్దతునిచ్చిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఒకే రకమైన పరోక్ష పన్ను విధానంతో వివిధ రకాల పరోక్ష పన్నులకు తెర పడుతుందన్నారు. వైఎఫ్‌ఎల్‌ఒ చైర్‌పర్సన్ నిధి స్వరూప్ చేసిన వినతిని నిర్మలా సీతారామన్ ప్రస్తావిస్తూ మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాల్సి ఉందని అన్నారు. ఇజ్రాయిల్‌లో స్టార్ట్‌ప్ ఇన్‌క్యుబేషన్ సెంటర్‌ను కేవలం మహిళలకే అప్పగించినట్లు చెప్పారు. మహిళలు ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహాయాన్ని కోరుతున్నారో చెప్పాలని ఆమె తెలిపారు. వివిధ వృత్తులకు సంబంధించి నైపుణ్యాన్ని పెంచకోవాలని ఆమె మహిళలకు సూచించారు. స్టార్ట్‌ప్‌ల కోసం మహిళలు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. ఇస్రో ప్రయోగించిన 104 శాటిలైట్స్‌లో మహిళా శాస్తవ్రేత్తలూ ముఖ్యభూమిక పోషించారని ఆమె తెలిపారు. మహిళలు గర్భవతి అయితే ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి 26 వారాలకు కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వైఎఫ్‌ఎల్‌వో చైర్‌పర్సన్ నిధి స్వరూప్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మూడు ప్రభుత్వ పాఠశాలలకు 600 పుస్తకాలను పంపిణీ చేశారు.