రాష్ట్రీయం

సమర్థులకే పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సింహాచలం, ఏప్రిల్ 8: రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే మంత్రి వర్గ విస్తరణ చేపట్టామని, కేబినెట్ కూర్పు ఎంతో కష్టతరమైనప్పటికీ కొన్ని ప్రాధాన్యతాంశాల మేరకు సమర్థులకు స్థానం కల్పిస్తూ విస్తరణ పూర్తి చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
సింహాచలం దేవస్థానంలో శనివారం ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ, విపక్ష ఎమ్మెల్యేలకు పదవులు తదితర అంశాలతోపాటు విపక్ష నేత జగన్ రాష్టప్రతికి ఫిర్యాదు చేయడంపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించగా, చంద్రబాబు సావధానంగా సమాధానాలిచ్చారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వారిలో సమర్థులున్నారు కాబట్టే వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించామని పేర్కొన్నారు. సత్వర అభివృద్ధి సాధించాలంటే పొలిటికల్ కన్సాలిడేషన్ అవసరమని, ఆ దిశగా కొన్ని చర్యలు అనివార్యమని భావించే ఇతర పార్టీల సభ్యులు టిడిపికి మద్దతిస్తే అభ్యంతరం చెప్పలేదన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఇతర పార్టీల ఎంపిలకు మంత్రి పదవులు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. సమర్థులని భావిస్తే ప్రభుత్వాధినేత ఎవరినైనా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చన్నారు. టిఆర్‌ఎస్ మంత్రివర్గంలోకి టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను తీసుకున్నప్పుడు అప్పటి పరిస్థితుల దృష్ట్యా తాను స్పందించానని సర్దిచెప్పుకున్నారు. పార్టీలు మారిన శాసనసభ్యులపై చర్యల అంశం స్పీకర్ పరిధిలో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎప్పుడు ఏం చేయాలి, ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నది సందర్భాన్నిబట్టి తీసుకుంటామని, దీనే్న చాణక్య నీతి అంటారని విలేఖరులకు గుర్తు చేశారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం విపక్ష నేత జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుసుకుంటున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండి, టిడిపి, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోలేదా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోరుతున్న జగన్, తన కేసుల్లో సాక్షులను ప్రభావితం చేస్తున్నట్టు సిబిఐ ఆరోపిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. జైలుకు వెళ్లి వచ్చినా జగన్‌లో మార్పు రాలేదన్నారు. ఆర్థిక నేరాల్లో నిందితుడైన జగన్ తన పత్రిక, టీవీల్లో తన కేసులకు సంబంధించి సాక్షులతో ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు.

చిత్రం..సింహాచలంలో అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు