రాష్ట్రీయం

కాళేశ్వరంపై మడతపేచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు వ్యవహార శైలిపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. భూసేకరణ విషయంలో కొన్ని సంస్ధలు కల్పిస్తున్న అవరోధాలు, అనుమతుల విషయంలో కేంద్ర జలసంఘం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నాయని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కేంద్ర జల సంఘం పెడుతున్న మడతపేచీలను రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. ప్రధానంగా కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు తెలంగాణ రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలకు భంగం కలిగేవిధంగా వ్యవహరిస్తున్న తీరును ప్రధాని, జలవనరుల మంత్రి దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రెండు కారణాలను సాగునీటి రంగ నిపుణులు చూపిస్తున్నారు. మార్చి 20న కేంద్ర జలసంఘం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టని, అన్ని అనుమతులు ఉండాలని కేంద్ర జలసంఘం పేర్కొంది. అనంతరం కేంద్ర జల సంఘం మూడు రాష్ట్రాలు ఆంధ్ర, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌కు ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలుంటే తెలియచేయాలని లేఖలు రాసింది.
ఇదిలావుంటే, గోదావరి నదీ జలాల బోర్డు ఈ ప్రాజెక్టుపై కేంద్ర జల సంఘానికి ఒక లేఖ రాసింది. కాళేశ్వరాన్ని కొత్త ప్రాజెక్టుగా పరిగణించాలని కోరింది. దీనికి రెండు కారణాలను గోదావరి బోర్డు ఉదహరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మిస్తున్నారని, ఈ నీటిని కృష్ణా బేసిన్‌లోని నల్లగొండ జిల్లాలో 29,169 ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 2,32,993 ఎకరాలకు, మేడ్చెల్ జిల్లాలో 50వేల ఎకరాలకు సాగునీటి కోసం మళ్లిస్తున్నారని గోదావరి బోర్డు లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. అలాగే గోదావరి నుంచి 30 టిఎంసి నీటిని గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మంచి నీటి అవసరాలకు మళ్లిస్తున్నారు. ఈ రెండు జిల్లాలు కృష్ణా బేసిన్‌లో ఉన్నాయి. ఇదే జరిగితే కృష్ణా నదిలో వాటా కావాలని మహారాష్ట్ర, కర్నాటక అడుగుతాయని గోదావరి బోర్డు నర్మగర్బంగా లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.
81వేల కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుగా ఉండేది. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కొన్ని అనుమతులు వచ్చాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరిన్ని చర్యలు తీసుకుంది. దాదాపు 180 టిఎంసి నీటి ద్వారా 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందివ్వాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. దీని నిమిత్తం భారీఎత్తున భూసేకరణ చేపట్టింది. దీనికోసం జీవో 123 విడుదల చేస్తే న్యాయపరంగా చిక్కులు ఎదురైతే తెలంగాణ భూసేకరణ సవరణ చట్టం తెచ్చి నిర్వాసితులకు పక్కా సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. మహారాష్టత్రోనూ కాళేశ్వరంపై ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో అనుమతులు ఇవ్వడంలో కేంద్ర జలవనరుల శాఖ ప్రదర్శిస్తున్న అలసత్వ వైఖరిని ఎండగట్టి అనుమతుల మంజూరు విషయంలో రాజకీయ పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పెద్దఎత్తున నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్న విషయం విదితమే. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. కాళేశ్వరం విషయంలో ఇకపై జాప్యానికి తావులేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి శాఖను ఆదేశించిన విషయం విధితమే.

*కాళేశ్వరాన్ని కొత్త ప్రాజెక్టుగా పరిగణించి అన్నిరకాల
అనుమతులూ తీసుకోవాలన్నది కేంద్ర జలసంఘం వాదన.

*ప్రాజెక్టుపై ఆంధ్ర, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌కు
అభ్యంతరాలుంటే చెప్పాలని లేఖలు రాయడం మరో పేచీ.

*కృష్ణా బేసిన్ ప్రాంతాల్లో గోదావరి జలాలు వాడితే,
కర్నాటక, మహారాష్టల్రు ఇదే విధానాన్ని కోరవచ్చన్నది గోదావరి బోర్డు వాదన.

*ప్రాజెక్టు కొలిక్కి వస్తున్న తరుణంలో కొత్త పేచీలు రేపుతుండటంపై తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.