రాష్ట్రీయం

దిక్సూచి విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 8:్భరత నౌకాదళ కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విశాఖలో నేవీ విస్తరణకు వాళ్లు ఏం కోరినా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. భారత నావికాదళంలో 29 సంవత్సరాలపాటు సేవలందించిన టియు-142ఎం యుద్ధ విమానం గత నెల 29న డి-కమిషన్ అయింది. ఈ విమానాన్ని విశాఖలో మ్యూజియంగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, నేవీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు టియు-142 విమానం శనివారం విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్‌కు చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, తూర్పు నౌకాదళ అధికారి బిస్త్ విమానానికి స్వాగతం పలికారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ టియు-142 యుద్ధ విమానం తన సుదీర్ఘ ప్రయాణంలో అనేక సాహసోపేత ఆపరేషన్లలో పాల్గొందన్నారు. బీచ్ రోడ్డులో కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియానికి ఎదురుగా ఈ విమానాన్ని ఉంచబోతున్నామని చెప్పారు. ఇదిలాఉండగా నేవీ భాగస్వామ్యంతో విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు జాయింట్ టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం ప్రకటించారు. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. విశాఖలో వాటర్ వెంచర్ స్పోర్ట్స్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ధ నౌకను విశాఖలో మ్యూజియంగా ఏర్పాటు చేసే అంశంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెపుతూ, దానికి వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఇందులో కేంద్రం కూడా కొంత భరిస్తే, విరాట్‌ను తీసుకురాగలుతామని చెప్పారు.
టియు-142కు ఘన స్వాగతం
తమిళనాడులోని అరక్కోణం జిల్లాలో ఉన్న ఐఎన్‌ఎస్ రజాలి ఎయిర్ స్టేషన్ నుంచి టియు-142ఎం యుద్ధ విమానం శనివారం ఉదయం 9.50 గంటల సమయంలో ఆఖరిసారిగా టేకాఫ్ తీసుకుంది. ఈ విమానం విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్‌కు సుమారు 10.50 గంటలకు చేరుకుంది. ఆఖరిసారిగా ల్యాండ్ అయిన ఈ విమానం డేగాలోకి ప్రవేశించగానే, విమానానికి ఇరువైపుల నుంచి వాటర్ కెనాన్స్‌తో నీటిని వెదజల్లుతూ స్వాగతం పలికారు. ఈ విమానంలో ఇప్పటివరకూ పనిచేసిన ఎనిమిదిమంది సిబ్బందిని ముఖ్యమంత్రి సత్కరించారు.
మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణి
గత ఏడాది జూలై 22న తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయల్దేరిన ఎఎన్-32 విమానం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన ఎనిమిదిమందిలో విశాఖకు చెందిన ఆర్‌వి ప్రసాద్‌బాబు, బి సాంబమూర్తి, ఎన్ చిన్నారావు, పి నాగేంద్ర, జి శ్రీనివాసరావు కూడా ఉన్నారు. వీరి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందచేశారు.

చిత్రాలు..టియు-142ఎం విమానానికి వాటర్ కేనన్స్‌తో స్వాగతం.
*ఆసక్తిగా తిలకిస్తున్న సిఎం చంద్రబాబు, ఇతర ప్రముఖులు