రాష్ట్రీయం

ఉద్యోగులు తమకు నచ్చిన రాష్ట్రాన్ని కోరుకోవచ్చు: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్టప్రతి ఉత్తర్వుల ప్రకారం ఏ జోన్‌లో నియమితులైన ఉద్యోగులకైనా రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టం మేరకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తమ సర్వీసులను కేటాయించాలని కోరుకునే అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ పంచాయతీరాజ్ శాఖకు చెందిన అహమ్మద్ అబ్దుల్ షమీ మరికొంత మంది ఇంజనీర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. విభజన సమయంలో తాము తెలంగాణ రాష్ట్రానికి తమ సర్వీసులను కేటాయించాలని కోరుకున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. కేంద్రం తమను తెలంగాణకు కేటాయించిందన్నారు. తమకు వ్యతిరేకంగా కొంతమంది ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా, తమ కేటాయింపులను నిలిపివేసిందన్నారు. ఈ కేసులో ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లుగా నియమితులైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతి చెందారని, ఇవి స్టేట్ కేడర్ పోస్టులని హైకోర్టు పేర్కొంది. కేంద్రం వీరిని తెలంగాణకు కేటాయించడం సమంజసమేనని హైకోర్టు పేర్కొంది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు పేర్కొంది.