రాష్ట్రీయం

ఓటుకు భారీ రేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఏప్రిల్ 9: కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీకి ఆదివారం జరిగిన 19వ వార్డు ఉప ఎన్నికకు అక్షరాలా 4.50 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు పరిశీలకులు అంచనా వేశారు. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేశాయి. జిల్లాలో విజయవాడ నగరపాలక సంస్థ, పెడన, గుడివాడ మున్సిపాలిటీల్లో ఖాళీగా వున్న స్థానాల్లో ఉప ఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల కాగా విజయవాడ, పెడనల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుడివాడలో మాత్రం ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఈ ఒక్క వార్డును గెల్చుకునేందుకు వైసిపి, టిడిపి తీవ్రంగా పోటీపడ్డాయి. 15 రోజులుగా వార్డులో ఎన్నికల ప్రచారానికి ఇరు పార్టీలూ ధారాళంగా డబ్బు ఖర్చు చేసినట్టు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ వార్డులో మొత్తం ఓటర్లు 2,905 మంది ఉన్నారు. ఒక్కో ఓటుకు టిడిపి రూ.7వేలు, వైసీపి రూ.5వేలు చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. ఓట్ల కొనుగోలుకే దాదాపు రూ.3.49 కోట్లు నీళ్లప్రాయంగా ఖర్చుచేశారు. దీంతోపాటు ఓటర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వైసీపి నాయకులు 50 గ్రాముల బరువుండే వెండి కుంకుమ భరిణిని దాదాపు 800 కుటుంబాలకు పంపిణీ చేసినట్లు తెలిసింది. దీని మొత్తం ఖర్చు సుమారు రూ.20 లక్షలుగా అంచనా వేశారు. టిడిపి నాయకులు కూడా వెండి కుంకుమ భరిణి స్థానంలో రూ.వెయ్యి చొప్పున మరో రూ.20 లక్షల మొత్తాన్ని పంపిణీ చేశారని అంటున్నారు. 2009లో జరిగిన మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో ఒక్కో వార్డుకు రూ.50 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. మరో రెండేళ్ల కాలపరిమితి ఉన్న 19వ వార్డు ఉప ఎన్నికకు దాదాపు రూ.4.50 కోట్లను వైసిపి, టిడిపి ఖర్చు చేయడం ఇంత భారీ వ్యయం దేశంలో ఇదే తొలిసారి కావచ్చని రాజకీయ విశే్లషకులు అంచనా వేస్తున్నారు.
19వ వార్డుకు ఆదివారం జరిగిన ఉప ఎన్నికలో 76.9 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి బండి శేషన్న చెప్పారు. ఇద్దరు డిఎస్పీలు, నలుగురు సిఐలు, 8మంది ఎస్‌ఐలు, 90మంది కానిస్టేబుళ్లు బందోబస్తు విధులు నిర్వర్తించారు.

చిత్రం..గుడివాడలో పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు