రాష్ట్రీయం

సాక్షుల్లేరు..శిక్షల్లేవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9:హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువేమీ కాదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రమాదాల సంఖ్య తగ్గుతున్న దాఖలాలు లేవు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా, కోర్టులలో సాక్ష్యాలు లేక నిలబడటం లేదంటే ఆశ్చర్య కలుగుతుంది. కేవలం మూడు శాతం కేసులలో మాత్రమే నిందితులకు శిక్ష పడుతోంది. సరైన సాక్ష్యాలు లేక కోర్టు వెలుపల సెటిల్‌మెంట్లు జరిగిన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం. గత నాలుగేళ్ల లెక్కలు చూస్తే... 2013లో 471 ప్రమాదాలు జరుగగా, 303 కేసులు నమోదై, చార్జీషీట్లు దాఖలయ్యాయి. వీటిలో కేవలం 12 మందికి మాత్రమే శిక్ష పడింది. 130 మందిపై కేసుల్ని కొట్టివేశారు. మరో 7 కేసులు దర్యాప్తులో ఉన్నాయి.
2014లో 388 ప్రమాదాలు జరిగితే, 255 కేసులు నమోదై, చార్జీషీట్లు దాఖలయ్యాయి. వీటిలో నలుగురికి మాత్రమే శిక్ష పడింది. 27 కేసులు కొట్టి వేయగా, ఐదు కేసులలో దర్యాప్తు కొనసాగుతోంది. 2015లో 394 రోడ్డు ప్రమాదాలు జరగగా, పోలీసులు 251 కేసులను గుర్తించి చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో ఒక్కరికి మాత్రమే శిక్ష పడింది. 13 కేసుల్ని
కొట్టివేశారు. మరో 15 కేసులు దర్యాప్తులో ఉన్నాయి. 2016లో 389 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 189 ప్రమాదాలు గుర్తించిన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. వీటిలో ఒక్కరికి మాత్రమే శిక్ష పడడం గమనార్హం. ఇద్దరిపై కేసులు కొట్టివేశారు. 129 కేసులలో దర్యాప్తు కొనసాగుతోంది. 2017 (20 మార్చి వరకు)లో 72 రోడ్డు ప్రమాదాలు జరగగా 48 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నాయి. సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులేవీ కోర్టుల్లో నిలబడటం లేదని, హిట్ అండ్ రన్ కేసుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని పోలీసులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన హిట్ అండ్ రన్, ర్యాష్ డ్రైవింగ్ సంఘటనల్లో నిందితులు సంఘటనాస్థలి వద్ద దొరికినప్పటికీ కోర్టులో బెయిల్ ద్వారా వెళ్లిపోతున్నారు. కేసు విచారణకు వచ్చినప్పుడు వారి అడ్రస్ లభించడం లేదు. నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసినా వారి ఆచూకీ దొరకడం లేదు. అదేవిధంగా కోర్టు వెలుపలే కేసులను పరిష్కరించుకోవడంతో నిందితులకు శిక్షలు పడడం లేదని పోలీసు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.