రాష్ట్రీయం

రూ.1.48 కోట్ల పాతనోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 9: గతేడాది రద్దైన పాతనోట్ల చెలామణి ఇంకా కొనసాగుతోంది. విశాఖ కేంద్రంగా పాతనోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.1.48 కోట్ల మేర పాతనోట్లను స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాతనోట్ల మార్పిడి వ్యవహారానికి సంబంధించి టాస్క్ఫోర్స్ ఎసిపి ఐ.చిట్టిబాబు మాట్లాడుతూ నగరంలోని దొండపర్తి, మర్రిపాలెం ప్రాంతాల్లో పాతనోట్ల చెలామణి జరుగుతోందన్న సమాచారం మేరకు తమ బృందం ఆదివారం ఉదయం ఏకకాలంలో దాడులు చేసిందన్నారు. దొండపర్తిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో విశాలాక్షినగర్‌కు చెందిన రమేష్ కుమార్ సీతమ్మధారకు చెందిన పిఆర్ రాజు, పి.సత్యగోపాల్‌తో కలిపి రూ.62 లక్షల పాత రూ.1000, రూ.500 నోట్లను సేకరించారు. వీటిని ఎన్‌ఆర్‌ఐల ద్వారా మార్చేందుకు వ్యూహం పన్నినట్టు తెలిపారు. అలాగే మరో సంఘటనలో హైదరాబాద్‌కు చెందిన బి.అప్పలనాయుడు, విజయవాడకు చెందిన పి.రమేష్‌కుమార్ రూ.86 లక్షలను సేకరించారు. ఈ రెండు ముఠాలు 70-30 రేష్యోలో పాతనోట్లకు కొత్త నోట్లు ఇచ్చేందుకు పార్టీల నుంచి ఒప్పందం కుదుర్చుకున్నట్టు పేర్కొన్నారు. 70 శాతం కమిషన్‌గా తీసుకునేందుకు ముఠాలు ఒప్పందం కుదుర్చుకుని, పాతనోట్లను మార్చే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎసిపి చిట్టిబాబు చెప్పారు.

చిత్రం..నిందితుల వివరాలను వెల్లడిస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులు