రాష్ట్రీయం

అర్చకుల నియామకాల్లో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: అర్చకుల నియామకం విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ హామీ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు తెలిపారు.
తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పిస్తే, కమిషనర్ సానుకూలంగా స్పందించారని వారు పేర్కొన్నారు. సర్వీసు భూమిని అనుభవిస్తున్న అర్చకులకు, ఇతర వాటాదార్లకు, పదవీ విరమణ చేసిన వారికి, మరణించిన అర్చకుల కుటుంబ సభ్యులకు, ఆధారం లేని వారి పిల్లలకు సంక్షేమ చర్యలను చేపడుతామని హామీ ఇచ్చారన్నారు. పలు అర్చక సంక్షేమ పథకాలు అర్చకులకు వర్తింప చేయాలంటే ప్రతిబంధకంగా ఉన్న కోడ్ నిబంధన గురించి కమిషనర్ దృష్టికి తెచ్చామన్నారు.
వంశపారంపర్య అర్చకుల కేసులో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, నిపుణుల కమిటీ నివేదికను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు సడలించాల్సిందిగా కోరామన్నారు. ఈ విషయమై భూమిని అనుభవిస్తున్న అర్చకుల పేర్లను నమోదు చేయాలని సహాయ కమిషనర్‌ను ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారన్నారు. అర్చకులకు వైద్య ఖర్చులను తక్షణమే మంజూరు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. అర్చకులకు కోడ్ కేటాయించడమంటే, ఇతర ఉద్యోగుల మాదిరిగా కాదని, ఉత్పన్నమవుతున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.