రాష్ట్రీయం

ఏంచేస్తున్నారో చెప్పండి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: రైతుల ఆత్మహత్యల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్రం, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు, నాబార్డు, ఆర్బీఐకి మంగళవారం నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం శాఖమూరుకు చెందిన రైతు కొల్లి శివరామిరెడ్డి రైతుల ఆత్మహత్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం, బ్యాంకులు పట్టించుకోవడం లేదని, రైతాంగాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషనర్ శివరామిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రైతులు మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారంటూ ఇటీవల ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రైతు పరిస్థితి దయనీయంగా ఉన్న పరిస్థితిలో ఇలాంటి వ్యాఖ్యలు మరింత బాధాకరంగా మారాయన్నారు. రైతాంగ రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయని పక్షంలో రానున్న రోజుల్లో ఆత్మహత్యలు మరిన్ని పెరిగే ప్రమాదం ఉందని కోర్టుకు వివరించారు. మిర్చి రైతుల సమస్యలను వివరిస్తూ, క్వింటాలు మిర్చి రూ.12వేల నుంచి రూ.4వేలకు పడిపోయిందని, గిట్టుబాటుధరలు లేక రైతులు తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని వివిరంచారు. గుంటూరు మార్కెట్ యార్డులో ఒక సాధారణ గుమాస్తా మిర్చి
గిట్టుబాటు ధర నిర్ణయించే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందన్నారు. మార్కెట్ యార్డులను రైతు సంక్షేమం, వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే కేంద్రాలుకాకుండా మంత్రులే అడ్డుపడుతున్నారని కోర్టుకు విన్నవించారు. రైతులకు కోర్టులంటే విశ్వాసం ఉందని, ప్రభుత్వం, రాజకీయ పార్టీలు రైతులను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. రైతులు రుణభారం మోయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారు ఆ చర్యలకు పాల్పడకుండా కోర్టులు జోక్యం చేసుకోవాలన్నారు. బ్యాంకులు తమకు బకాయివున్న పారిశ్రామికవేత్తల నుంచి రూ. 6 లక్షల కోట్లు వసూలు చేయడం లేదని, అదే సమయంలో రైతులనుంచి రుణాల వసూలుకు నిర్బంధ చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. స్వామినాథన్ కమిటీ నివేదిక, సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేలా ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ తరఫున న్యాయవాది శరత్‌కుమార్, ఆంధ్ర తరఫున న్యాయవాది డి రమేష్ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే రైతుల ఆత్మహత్యలపై రెండు పిల్స్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను శరత్‌కుమార్ వివిరంచారు. ఈ సందర్భంగా పిటిషనర్ జోక్యం చేసుకుని ముందు రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించారు. రైతు ఆత్మహత్యల నిరోధానికి ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయో తక్షణం తెలపాలని ఆదేశిస్తూ, కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.