రాష్ట్రీయం

రుణమాఫీ పూర్తయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: పంట రుణాల మాఫీపై తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చింది. రుణ మాఫీ చివరి వాయిదా మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలను మంగళవారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పంట రుణాలు మాఫీ చేయనున్నట్టు ఎన్నికల ప్రణాళికలోనే టిఆర్‌ఎస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం మాఫీ చేసిన రుణం మొత్తం రూ.17 వేల కోట్లు. ఈ మొత్తాన్ని రూ.4200 కోట్ల చొప్పున నాలుగు వాయిదాల్లో 2014, 2015, 2016, 2017 ఆర్థిక సంవత్సరాల్లో చెల్లించడానికి బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఇదివరకే మూడు వాయిదాలు చెల్లించిన ప్రభుత్వం చివరి వాయిదాను మంగళవారం విడుదల చేసింది. రాష్టవ్య్రాప్తంగా రుణ మాఫీ వల్ల 36 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. బ్యాంకులకు లక్ష రూపాయల చొప్పున రైతులు బకాయిపడిన మొత్తం రూ. 17 వేల కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ రైతుల ఖాతాలను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వానికి వెయ్యి కోట్ల వరకు ఆదా అయినట్టు సమాచారం. ప్రతీ విడత బ్యాంకులకు రూ.4200 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఆధార్ కార్డుల అనుసంధానం వల్ల రూ. 4000 కోట్లు మాత్రమే చెల్లించింది. దీనివల్ల ప్రభుత్వం రూ. 17 వేల కోట్లకుగాను రూ. 16 వేల కోట్లు మాత్రమే చెల్లించింది.