రాష్ట్రీయం

ఏపీ ఎంసెట్‌కు 2.76 లక్షల దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 11: ఏపీ ఎంసెట్-2017కు ఇప్పటివరకు 2 లక్షల 76వేల 583 దరఖాస్తులు దాఖలయ్యాయి. గడువు తేదీలోగా దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఎపి ఎంసెట్ కన్వీనర్, జెఎన్‌టియుకె రిజిస్ట్రార్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు చెప్పారు. ఇంజనీరింగ్ పరీక్షలను ఈ నెల 24, 25, 26 తేదీలలోను, అగ్రికల్చర్ పరీక్షలను ఈనెల 28వ తేదీన నిర్వహించడానికి వర్సిటీ ఏర్పాట్లుచేస్తోంది. ప్రవేశ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్ష తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం దరఖాస్తులను అపరాధ రుసుంతో స్వీకరిస్తున్నారు. అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను మార్చి 21వ తేదీ వరకు స్వీకరించారు. మార్చి 26వరకు రూ.500, ఏప్రిల్ 10వ తేదీ వరకు రూ.1000 అపరాధ రుసుంతో దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 11నుండి 17వ తేదీ వరకు రూ.5000, 18వ తేదీ నుండి ఈనెల 22వ తేదీ వరకు రూ.10వేల అపరాధ రుసుంతో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటివరకు విశ్వ విద్యాలయానికి 2 లక్షల 76వేల 583 దరఖాస్తులు అందగా ఇందులో ఇంజనీరింగ్‌కు సంబంధించి 1,96,183, అగ్రికల్చర్‌కు 79,303 మంది, రెండింటికీ కలిపి 1,097 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఈ సంవత్సరం ఎంపిక చేసిన 140 కేంద్రాలలో ఆన్‌లైన్ విధానంలో ఎంసెట్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎంసెట్‌కు సంబంధించి సందేహాలను నివృత్తి చేసుకోదలచిన వారు 0884-2340535, 0884-2356255 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సాయిబాబు సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి కాలిక్యులేటర్లు, స్మార్ట్‌వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని చెప్పారు. ఒక నిముషం ఆలస్యమైనా విద్యార్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించే అవకాశం ఉండదని, ఆయా కేంద్రాలకు పరీక్షకు అర గంట ముందుగా హాజరు కావాలని స్పష్టంచేశారు. పరీక్ష తేదీ, సమయాన్ని విద్యార్థికి హాల్‌టిక్కెట్‌లో తెలియజేస్తామన్నారు. హాల్ టిక్కెట్‌లో ఏ తేదీని కేటాయించారో అదే ఆ రోజే పరీక్షకు హాజరు కావాలన్నారు.