రాష్ట్రీయం

ఒంటిమిట్ట రామయ్య రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 11: కడప జిల్లా ఒంటిమిట్టలో వెలసిన శ్రీకోదండరాముడి రథోత్సవం మంగళవారం వేడుకగా జరిగింది. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి రథం వద్దకు తోడ్కొని వచ్చారు. హారతి అనంతరం శ్రీసీతారామలక్ష్మణ స్వాముల విగ్రహాలను రథంలో ఆశీనులను చేయించారు. కూష్మాండబలి, హారతి అనంతరం 10.30 గంటల ప్రాంతంలో రథం ముందుకు కదిలింది. శ్రీరామ జయరామ జయజయరామ అంటూ భక్తులు నినాదాలు చేస్తూ రథాన్ని లాగారు. సోమవారం రాత్రి జరిగిన స్వామివారి కల్యాణోత్సవానికి హాజరైన భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పట్టణంలోని బురుజు వద్దకు చేరింది. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు రథం కదిలి 6 గంటలకు యధాస్థానం చేరుకుంది. పెద్దసంఖ్యలో తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.