రాష్ట్రీయం

వచ్చే వారం కృష్ణా బోర్డు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11:నాగార్జునసాగర్, శ్రీశైలంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరడం, మంచినీటి కోసం తమ వాటా నీటిని కేటాయించాలంటూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వత్తిడి పెరగడంతో వచ్చే వారంలో కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రప్రభుత్వాలకు సమాచారం అందింది. తమకు 15 టిఎంసిల నీటిని ఇవ్వాలని ఆంధ్ర, 12 టిఎంసి నీటిని ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాలు కృష్ణా బోర్డును డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంలో 804 అడుగుల నీటి మట్టంలో కేవలం 31.04 టిఎంసి నీరు, నాగార్జున సాగర్‌లో 506.3 అడుగుల నీటిమట్టం వద్ద 125.18 టిఎంసి నీరు ఉంది. మరో వారం రోజుల్లో శ్రీశైలంలో 800 అడుగులు, నాగార్జునసాగర్‌లో 500 అడుగులకు నీటి మట్టం చేరుతాయని సాగునీటి ఇంజనీర్లు తెలిపారు. కాగా ఒక కోటి జనాభా ఉన్న హైదరాబాద్ పరిసరాల్లోని ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా నాగార్జునసాగర్‌లో పుట్టంగండి వద్ద నీటిని తోడేందుకు 7 అత్యవసర పంపులను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో మూడు పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పంపులను ఏర్పాటు చేస్తే తప్ప డెడ్‌స్టోరేజీకి చేరువలో ఉన్న నీటిని తోడి హైదరాబాద్ పరిసరాల ప్రజలకు మంచినీటిని సరఫరా చేయలేని పరిస్ధితి నెలకొంది. ఈ పంపుల ద్వారా సగటున రోజుకు 270 మిలియన్ గ్యాలన్స్‌ను హైదరాబాద్‌కు పంపిస్తారు. ఈ నీటిని కృష్ణా వాటర్ సప్లై స్కీం కింద 1,2,3 దశల్లో ఉన్న ప్రాంతాల్లోకి మంచినీటిని సరఫరా చేస్తారు. మరో మూడు నెలలపాటు అంటే నాగార్జున సాగర్ నీటి మట్టం 496 అడుగులకు వచ్చేవరకు ఈ పంపుల ద్వారా నీటిని తోడుతారు. దీనివల్ల వచ్చే మూడు నెలల పాటు మంచినీటికి ఇబ్బంది ఉండదు.