రాష్ట్రీయం

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అన్న ప్రశ్నకు ఠక్కున సమాధానం చెప్పడం ఇప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. ఇదే ప్రశ్న ఏ పోటీపరీక్షలోనో వస్తే అభ్యర్థులు ఏమని సమాధానం రాయాలి? ‘అమరావతి’ అని రాయాలా? ‘హైదరాబాద్’ అని రాయాలా? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం-2014 ప్రకారం హైదరాబాద్ నగరం ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు కొనసాగుతుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయం, శాసనసభ, శాసనమండలి, వివిధ శాఖలకు చెందిన రాష్టస్థ్రాయి ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నింటికీ అవసరమైన భవనాలను కేంద్రప్రభుత్వం హైదరాబాద్‌లో కేటాయించింది. హైదరాబాద్‌లోని శాసనసభ భవన సముదాయంలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలికి వసతి కల్పించారు. రాష్ట్ర సచివాలయంలో తొమ్మిది భవనాలు ఉండగా, ఐదు భవనాలను ఎపి సచివాలయానికి కేటాయించారు. వ్యవసాయం, విద్యలతో సహా ఇతర శాఖలకు చెందిన కమిషనరేట్లు, డైరెక్టరేట్లకు కూడా భవనాలను సమకూర్చారు. రెండు రాష్ట్రాలకు గవర్నర్ ఒక్కరే ఉంటాడని పునర్వ్యస్థీకరణ చట్టంలో పేర్కొనడంతో రాజ్‌భవన్ ఒక్కటే రెండు రాష్ట్రాలకు సంయుక్తంగా ఉపయోగపడుతోంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా పట్టుదలతో ఎపి రాజధానిని హైదరాబాద్ నుండి అమరావతికి తరలించాలని సంకల్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేత 2015 అక్టోబర్ 22 న గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెం వద్ద రాజధానికి శంకుస్థాపన చేయించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికల రూపకల్పన, నిర్మాణ పనులు తదితర వౌలిక సదుపాయాల కల్పన సిఆర్‌డిఎకు అప్పగించారు. ఈ సంస్థ జపాన్, సింగపూర్, చైనా తదితర దేశాలకు చెందిన ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలతో రాజధాని భవనాలు తదితర నిర్మాణాలకు సంబంధించిన అనేక ఒప్పందాలను కుదుర్చుకుంది. రాష్ట్ర రాజధానిలో ఉండాల్సిన అన్ని రాష్టక్రార్యాలయాలను అమరావతిలో గత రెండున్నర ఏళ్లలో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర శాసనసభ, శాసనమండలి భవనాలు, రాష్ట్ర సచివాలయంతో సహా హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్ అన్నీ అమరావతిలో పనిచేయడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంప్ ఆఫీస్, మంత్రుల నివాసాలు, క్యాంప్ ఆఫీసులన్నీ అమరావతి లేదా ఆ చుట్టుపక్కల ఉన్న భవనాలకు తరలించారు. అంటే ఉమ్మడి రాజధాని నుంచి పనిచేయాల్సిన కార్యాలయాలన్నీ అమరావతి నుండే పనిచేస్తున్నాయి. కొన్నింటికి మాత్రం విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో భవనాలను తాత్కాలికంగా కేటాయించారు. వాస్తవంగా రాష్ట్ర రాజధానిగా అమరావతి పూర్తిస్థాయిలో ఇప్పుడు పనిచేస్తోంది. శాసనసభ, శాసనమండలి సమావేశాలు అమరావతిలోనే ప్రారంభమయ్యాయి. సచివాలయం కొత్త భవనం ప్రారంభమైంది. మంత్రులకు కార్యాలయాలు కేటాయించారు. అమరావతిని ‘ప్రజారాజధాని’ (పీపుల్స్ క్యాపిటల్) అంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. అంతర్జాతీయంగా గుర్తింపు ఉండేలా దీన్ని తీర్చిదిదేందుకు సిఆర్‌డిఎ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్టస్థ్రాయిలో ఉండాల్సిన పోస్టల్ సర్కిల్‌తో పాటు వివిధ కేంద్ర కార్యాలయాలను విజయవాడ, అమరావతి, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. 13 జిల్లాల నుండి రాష్ట్ర రాజధానికి రోడ్లను నిర్మిస్తున్నారు. హైవేలను ఆధునీకరిస్తున్నారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు ఇప్పటికే ఇంటర్నేషనర్ క్యారెక్టర్ వచ్చింది. దీన్ని అంతర్జాతీయ విమనాశ్రయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర విమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి రాజధానిగా అమరావతి పనిచేయడం ప్రారంభమైంది.
ఈ పరిస్థితిలో అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘డీ ఫ్యాక్టో’ (వాస్తవ) రాజధానిగా మారింది. హైదరాబాద్ నగరం ‘డీ జ్యూరీ’ (చట్టపరమైన) రాజధానిగా కొనసాగుతోంది.