రాష్ట్రీయం

బాలికలే టాప్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, వైఎస్‌ఆర్ కడప జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. ఎంపిసిలో 992 మార్కులతో షేక్ షర్మిల, 991 మార్కులతో డి సాయివంశీ, 991 మార్కులతో డి లోకేష్ తొలి మూడు స్థానాలు సాధించి రాష్ట్రంలో టాపర్స్‌గా నిలిచారు. బైపిసిలో 991 మార్కులతో ఎ నైమిష, 990 మార్కులతో పి లీమ, 990 మార్కులతో ఎస్ సారిక తొలి మూడు స్థానాలు సాధించారు. ఎంఈసిలో 983 మార్కులతో డి నేహ, 982 మార్కులతో ఎ భువనేశ్వర్, 981 మార్కులతో ఆర్ అవినాష్ తొలి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. గురువారం విజయవాడలో మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు విడుదల చేశారు. గతంలో ఏన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 24రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు 10,31,376 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారని మంత్రి చెప్పారు. వీరిలో 9,80,593 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 50,783 మంది ప్రైవేట్ విద్యార్థులన్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 4,88,850 మంది హాజరుకాగా 3,14,471 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు 4,29,586 మంది హాజరుకాగా 3,30,986 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి తెలిపారు. గతంలోకంటే మాల్‌ప్రాక్టీస్ కేసులు తగ్గినట్లు తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్‌లో బయోమెట్రిక్ హాజరు పెట్టామని, ఉపాధ్యాయులకు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించామని తెలిపారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో కృష్ణా జిల్లా 77 శాతంతో మొదటి స్థానం, నెల్లూరు జిల్లా 69 శాతంతో ద్వితీయ స్థానం, పశ్చిమ గోదావరి జిల్లా 67 శాతంతో తృతీయ స్థానం, వైఎస్‌ఆర్ కడప జిల్లా 53 శాతంతో చివరి స్థానంలో నిలిచాయని వెల్లడించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 86 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానం, 80 శాతంతో పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ద్వితీయ స్థానం, 79 శాతంతో గుంటూరు జిల్లా తృతీయ స్థానం, 66 శాతంతో వైఎస్‌ఆర్ కడప జిల్లా చివరి స్థానంలో నిలిచాయన్నారు. మే 15 నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. వచ్చే ఏడాది నుండి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి గంటా వివరించారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఫోన్ చేసి అభినందించారు. సోమవారం టాపర్లను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడతానని చెప్పారు.

చిత్రాలు..విజయవాడలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు

*బైపిసి టాపర్ ఎ. నైమిష (991 మార్కులు)