రాష్ట్రీయం

అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 13: నవ్యాంధ్ర రాజధానిలో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఆయన పేరిట స్మృతివనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులు కేటాయించింది. రాజధాని ప్రతిపాదిత తుళ్లూరు మండలం శాఖమూరు- ఐనవోలు గ్రామాల మధ్య నిర్మించే ఈ స్మృతివనంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర గిరిజన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధుల బృందం అంబేద్కర్ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని వౌ గ్రామం నుండి పవిత్ర మట్టి, నీరు, భారత పార్లమెంటు మట్టితో సహా రాష్ట్రంలోని 10 ప్రధాన బౌద్ధక్షేత్రాల నుంచి పవిత్రజలాలు, మట్టిని ప్రత్యేక కలశాలలో సేకరించి తీసుకొచ్చారు. వీటిని గుంటూరు కలెక్టరేట్‌లో భద్రపరిచారు. రాజధాని భూమి పూజ తరహాలోనే వివిధ ప్రాంతాలకు చెందిన మట్టి, నీరు కలశాలతో అంబేద్కర్ స్మృతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూమిపూజ అనంతరం శాసనసభ సమీప మైదానంలో బహిరంగసభకు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరుకానున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి సుమారు పదివేల మంది వరకు ప్రజలు హాజరవుతారని అంచనా. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చిత్రాలు..శాఖమూరు-ఐనవోలు గ్రామాల మధ్య 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపనకు జరుగుతున్న ఏర్పాట్లు. వివిధ బౌద్ధక్షేత్రాలు, పార్లమెంటు నుంచి పవిత్ర మట్టి, నీరుతో సేకరించిన కలశాలు