రాష్ట్రీయం

విజయవాడలో కుంగిన రోడ్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాతబస్తీ), ఏప్రిల్ 13: పాతబస్తీలోని పంజా సెంటర్ నుండి నెహ్రూబొమ్మ సెంటర్ వరకు వున్న గణపతిరావు రోడ్డులో చేపల మార్కెట్ రోడ్డు కుంగిపోయింది. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఓ రిక్షా కార్మికుడు వెళుతున్న సమయంలో రోడ్డు కుంగిపోయి రిక్షా ఒరిగిపోయింది. దీంతో స్థానికులు అప్రమత్తమై రిక్షాను బయటకు లాగారు. స్థానికులు చూస్తుండగానే సుమారు మూడు మీటర్ల పొడవు, రెండు మీటర్ల
వెడల్పున గొయ్యి ఏర్పడటంతో చూపరులు భయభ్రాంతులకు గురయ్యారు. నేల కుంగిపోవటంతో భూకంపం వస్తుందని కొందరు భయపడుతూ పరుగులు తీశారు. కాగా ఈ సంఘటనతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాహనాలు సుమారు అర్ధగంట పాటు ముందుకు కదలలేదు. రోడ్డు కుంగుదల ఏమేరకు ఉందో అంచనా వేయలేక వాహనదారులు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిపివేయటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొత్తపేట లా అండ్ ఆర్డర్ పోలీసులు, వన్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈలోగా స్థానికులు ఎర్రగుడ్డను అక్కడ అడ్డంగా చూపుతూ వాహనాలు గుంటలో పడకుండా చూశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగనందున పోలీసులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనతో పాతబస్తీలో వాహనాలు ఆ ప్రాంతానికి వచ్చేసరికి అత్యంత నమ్మదిగా ముందుకు వెళ్లడంతో వాహనచోదకులు అసౌకర్యానికి గురయ్యారు. సమాచారం అందిన విఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు.

చిత్రం..విజయవాడ నగరంలో కుంగిన రోడ్డు