రాష్ట్రీయం

అరుదైన చేప లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్వపల్లి, ఏప్రిల్ 14: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మాల గ్రామ చెర్వులో అరుదైన గోల్డ్ ఫిష్ లభ్యమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మత్స్యకారులు గత మూడురోజులుగా గ్రామంలోని గంగదేవిచెర్వులో చేపలు పడుతున్నారు. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన మత్స్యకారుడు ఆరె సైదులు చేపల కోసం వేసిన వలలో అరుదైన గోల్డ్ ఫిష్ చేప ఒకటి పడింది. పూర్తిగా బంగా రు వర్ణంలో ఉన్న ఈ చేప కిలోన్నర బరువు ఉంది. ఈ చేపను గ్రామస్తులు వింతగా తిలకించారు. ఇలాంటి రకం చేపలు సముద్రాల్లోనే ఉంటాయని, చెర్వులో లభించడం అరుదైన విషయమని మత్స్యకారులు చెబుతున్నా రు. కాగా మత్స్యకారులు ఈ చేపను కోసి భుజించారు.